– బంగారు తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చిండు
– ఉమ్మడి రాష్ట్రంలో లిక్కర్ ఆదాయం రూ.10వేల కోట్లు
– ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రూ.40వేల కోట్ల ఆదాయం
– ఘట్కేసర్ ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆరోపణ
– నిరసనగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
– తనకు వచ్చిన రైతుబందు డబ్బులతో వైన్సుల వద్ద పేదలకు సంక్రాంతి కిట్ పంపిణీ
ఘట్కేసర్, నమస్తే ఎల్లంపల్లి: మన బంగారు తెలంగాణ ను ముఖ్యమంత్రి కేసీఆర్ తాగుబోతుల తెలంగాణ గా మార్చిండని రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు రాష్ట్ర ఎంపీపీల పోరం అధ్యక్షులు ఘట్కేసర్ మండల్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో లిక్కర్ పై రూ.10వేల కోట్ల ఆదాయం వస్తే.. నేడు తెలంగాణ లో రూ. 40వేల కోట్ల ఆదాయం కేవలం లిక్కర్ పై వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తనకు వచ్చిన రైతు బంధు డబ్బులతో వైన్సుల ముందు పేదలకు సంక్రాంతి కిట్ లను ఉచితం గా పంపిణీ చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రంలో విరివిగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి రైతులను, శ్రామికులను కేసీఆర్ మద్యానికి బానిస గా మారుస్తున్నదని ఆరోపించారు. సంక్షేమ పథకాల ముసుగులో డబ్బులు పంపిణీ చేసి మళ్ళీ వైన్సుల ద్వారా రైతులను, రోజు కూలీలను లూటీ చేస్తున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం మనతో తాగిపించి మన డబ్బులతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ గొప్పలకు పోతున్నాడని సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ముగ్గురి లో ఒకరు, ఇద్దరు మద్యానికి బానిస అయ్యారని, అలాగే చాలా మంది చిన్న వయసులోనే రోగాల బారిన పడి ప్రాణాలని పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నే నేడు దేశంలో నే అత్యధిక మంది మహిళలు వితంతువులు గా మరి దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారన్నారు. ఇప్పటికే రైతు బంధు అమలు చేస్తున్న కేసీఆర్ కొత్తగా దళిత బంధు, ఎస్టీ బంధు ల పేరుతో ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నాడన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సినీ సర్టిఫికెట్ మెంబర్ మైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ మాయ నరేష్, వార్డు సభ్యులు మల్లేష్, సురేష్, నాయకులు గడ్డం మహేష్, హరివర్ధన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సాయిలు, రాజశేఖర్ రెడ్డి, అరుణ్, రఘురాం రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మహేష్, నరేందర్ రెడ్డి, రవి, ప్రవీణ్ గౌడ్, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.