నవతరం

తెలుగు దినపత్రిక

కంటివెలుగు పథకాన్ని విజయవంతం చేయండి

హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమీషనర్ శ్వేతా మహంతి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ డా. సత్యనారాయణ లు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతికుమారి మాట్లాడుతూ, ఈనెల 18 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. 2018 లో నిర్వహించిన తొలివిడత కంటి వెలుగు కన్నా ఎక్కువ మందికి కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా మన రికార్డు మనమే బద్దలుకొట్టి సరికొత్త రికార్డు సృష్టించాలని కలెక్టర్లను ప్రోత్సహించారు. ఇప్పటికే 15 లక్షలకు పైగా కళ్ళద్దాలను రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలకు, అర్బన్ వైద్య కేంద్రాలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 1500 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. కంటి వెలుగు పై ప్రతి ఇంటికి, ప్రతీ ఒక్కరికీ తెలిసేలా విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని, అత్యంత ఉన్నత ప్రమాణాలతోకూడిన సేవలను అందించాలని సి.ఎస్. ఆదేశించారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading