నవతరం

తెలుగు దినపత్రిక

అంతా కన్ఫ్యూజన్…!

మంథని నియోజకవర్గంలో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో..? కాంగ్రెస్ పార్టీలో చేరికలు. బిఆర్ఎస్ పార్టీలో చేరికలు, బిజెపిలో చేరికలు


మంథని, నమస్తే ఎల్లంపల్లి: మంథని మండలం అక్కేపెల్లి గ్రామానికి చెందిన పోయిల తిరుపతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. మంథని నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ పై బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అలుగుతున్నారా? గత సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు నియోజకవర్గంలో జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు టచ్ లో ఉండి పలు సమస్యలపై ప్రస్తావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం! ఎన్నికలు మరో సంవత్సరం ఉన్నాయి కాబట్టి మేము ఒక ఆరు లేక ఎనిమిది నెలల్లో మీతోనే కలిసి నడుస్తాము, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటామని గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారు చాలామంది శ్రీధర్ బాబుతో అంటున్నట్టు తెలిసింది.? మహాదేవపూర్ పలిమెల మహా ముత్తారం కాటారం మలహర్ మంథని ముత్తారం ఈ మండలాలకు చెందినవారు నిత్యం ఆయనతో అనేక సమస్యలు పాలుపంచుకుంటున్నట్టు తెలుస్తోంది.? దీంతో ఇప్పుడే ఎలక్షన్స్ వచ్చాయా? అన్నట్టు మంథని నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు హడావిడి చేస్తున్నారు. ఒకవైపు మంథని నియోజక వర్గానికి బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, అలాగే బిజెపి పార్టీ నుండి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రజల్లోకి వెళ్తున్న చంద్రుపట్ల సునీల్ రెడ్డిలు నిత్యం మంథని నియోజకవర్గంలో పలు శుభ, అశుభ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎన్నికల ప్రచారం జరుగుతుందా.? అన్న తీరును తలపించే విధంగా వీరి కార్యక్రమాలు ఉంటున్నాయి. అంతేకాదు, మంథని నియోజకవర్గంలో ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో ఉంటారు, రేపు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, ఎల్లుండి బిజెపి పార్టీలోకి మారుతున్నారు. ఈ మారడాలు వెనక అంతర్యం ఏమిటోన నీ మంథని నియోజక వర్గ ప్రజలకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీలు మారకుండా పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్న తరుణంలో బిఆర్ఎస్ పార్టీలోకి కూడా కొందరు మారడం ఆశ్చర్యాలకు గురిచేస్తుంది. ఎమ్మెల్యే దుర్గిళ్ల శ్రీధర్ బాబు కానీ, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కానీ, బిజెపి నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి గాని ఏ గ్రామానికి పోయినా ముగ్గురికి అదే తీరుగా ప్రజలు స్వాగతం పలకడం ఆశ్చర్యమేస్తోంది. నియోజకవర్గంలో ముగ్గురిని ఒకే కోణంలో చూడడం జరుగుతుంది. ఇక సోషల్ మీడియా వేదికలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వారి వారి పార్టీల బలాలను గుర్తిస్తూ ప్రజలలో పార్టీ పై సానుభూతి చూపించే కోసము ప్రయోగాలు చేస్తున్నారు సోషల్ మీడియా ఇన్చార్జిలు. అంతేకాదు సోషల్ మీడియాలో ఆయా పార్టీ నాయకులు కార్యకర్తలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ మంథని నియోజకవర్గంలో వార్ ను తలపించే విధంగా నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేస్తున్న వారికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్ చేసి మా పార్టీలోకి రావాలని ఆహ్వానించడం, అదే తీరును కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా పార్టీలోకి రావాలని థాయిలాలు ఇచ్చే ప్రయత్నంలో ఇరు పార్టీలు ఉన్నాయని విశ్వసినీయ సమాచారం.? పార్టీలు ఆహ్వానించిన ఆహ్వానించకపోయిన మాత్రం మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వైపు వేలాది మంది చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొందరు నోరు తెరిస్తే రేషన్ బియ్యం, పింఛన్లు, ఇతరత్రా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రద్దవుతాయేమోనని భయంలో ఉన్నట్టు తెలుస్తుంది.! అయితే మంథని నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఏ పార్టీ ఉందో నేటికీ అర్థం కాలేని పరిస్థితి ఉంది. దిన దినం కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు ప్రజల్లోకి వెళుతూ అనేక సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలకు మరింత చేరు అవ్వాలని ఆలోచనలతోనే పై ముగ్గురు నాయకులు ప్రజలకు చేరువవుతున్నారు. ఇరువురు పార్టీల నాయకులు ప్రధానంగా కాటారం సబ్ డివిజన్ పైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి వారి కార్యక్రమాలు ఈ ప్రాంతంలోనే చేపట్టడం అనుమానాలకు తావిస్తోంది. మంథని నియోజకవర్గం సగభాగం పెద్దపల్లి జిల్లాలో, సగభాగం భూపాలపల్లి జిల్లాలో ఉండడం వల్ల రెండు జిల్లాల నాయకులతో సమన్వయం చేసుకోవడం ఈ పార్టీలకు తలనొప్పిగా మారింది. ఇప్పటివరకు అయితే ఈ మూడు పార్టీల నాయకులకు ప్రజలు మంచిగా స్వాగతం పలుకుతున్నారు కానీ, వచ్చే రోజుల్లో ఎవరికి చమర గీతం పాడి ఎవరికి అధికారం ఇస్తారో వేచి చూడాల్సిందే, ఏది ఏమైనా మంథని నియోజకవర్గంలో వార్ నడుస్తుంది అనడంలో సందేహం లేదు.

(మేడారం న్యూస్ ఏజెన్సీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, సీనియర్ జర్నలిస్టు – పర్కాల సమ్మయ్య గౌడ్ 9948701109, 8332022212)

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading