నవతరం

తెలుగు దినపత్రిక

ఎలక్ట్రికల్ సమస్యలను పరిష్కరించండి

*ఎలక్ట్రికల్ సమస్యలపై ఎమ్మెల్యే క్యాంపు కార్యలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, నమస్తే ఎల్లంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని వివిధ కాలనీలలో, బస్తీలలో నెలకొన్న విద్యుత్ సమస్యపై ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు అరేకపుడి గాంధీ, గౌరవ కార్పొరేటర్ లు తదితర శాఖల అధికారులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ డివిజన్ లో నెలకొన్న విద్యుత్ సమస్యలపై చర్చించారు. డివిజన్ లో వివిధ ప్రాంతాలలో సిథిలావస్థకు చేరుకున్న కరెంట్ పోల్స్ ను తొలగించి వాటి స్థానంలో నూతన కరెంట్ పోల్స్ ను ఏర్పాటు చేయాలని, బస్తిలలో అవసరం ఉన్న చోట్ల త్రీఫేస్ కన్వర్షన్ వైర్స ఏర్పాటు చేయాలని, కొన్ని చోట్ల ప్రమాదకరంగా ఇండ్లపై నుండి వెళ్లిన విద్యుత్ వైర్లను తొలగించి ప్రత్యమమైన ఏర్పాటు చేయాలని, ప్రమాదకరంగా రోడ్డు పై ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తీసి ప్రత్యామమైన ఏర్పాటు చేయాలని మరియు ట్రాన్స్ఫార్మర్ కొరకు ఏర్పాటు చేసిన దిమ్మే సిధిలావస్థలో ఉన్న దిమ్మే ల స్థానంలో నూతనంగా పిల్లర్లు ఏర్పాటు చేసి ట్రాన్స్ఫార్మర్లను అమర్చాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులకు వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ టీఎస్ఎస్పీడీసీఎల్ శ్రీనివాస్ రెడ్డి, పిజిఎం ఆనంద్, ఎస్ఈ వెంకన్న, అధికారులు, నియోజకవర్గంలోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిఈ లు, ఎడిఈ లు, ఎఈ లు, తదితర డివిజన్ ల కార్పొరేటర్ లు, డివిజన్ అధ్యక్షులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading