* తెలంగాణ సంపద ఆంధ్రులకు కట్టబెడుతున్న బిఆర్ఎస్
* దళితబంధు వంటి పథకాలు మోసం చేయడానికే
* బిజెపిని ప్రజలు క్షమించరు
కాగజ్ నగర్ / ఆసిఫాబాద్, నమస్తే ఎల్లంపల్లి: సిర్పూర్ నియోజకవర్గాన్ని తెలంగాణలో విలీనం చేయడానికి ఈ బహిరంగ సభ జరుగుతుందన్నారు.సిర్పూరు ఇంకా ఆంధ్ర వలసవాదుల కబ్జాలోనే ఉందన్నారు. 2008లో తుమ్మిడిహట్టి దగ్గర అప్పటి సిఎం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో భూములు లాక్కొని, కొందరికి పరిహారం కూడా ఇవ్వకుండా 1500 కోట్లు ఖర్చుచేసారు. ఆ కాంట్రాక్టు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఇచ్చారని గుర్తుచేశారు. పైగా ప్రాజెక్టు నిలిపివేసి కమీషన్ల కోసం రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి 82వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు ఆంధ్రవారికే అప్పజెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికి కూడా క్రషర్లు, కంకర క్వారీలు పెట్టి, రోడ్ల కాంట్రాక్టుల పేరుతో 50 కోట్లు ఆంధ్రకు చెందిన వల్లభనేని కన్స్ట్రక్షన్స్ కి అప్పజెప్పారని విమర్శించారు.
ఆంధ్ర నుండి వచ్చిన దోపిడీ పాలకులు తెలంగాణ బహుజన బిడ్డలను చంపుతామని బెదిరిస్తున్నాడంటే ఇంకా తెలంగాణ రాలేదని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పేదల భూములను లాక్కోవడానికే ధరణి తీసుకొచ్చారని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన బహుజన బిడ్డలకు ఉన్నత పదవులు ఇవ్వకుండా ఇటీవల ఛీఫ్ సెక్రటరీ పదవి ఆంధ్రవారికి కట్టబెట్టిన తెలంగాణ వ్యతిరేకి కేసిఆర్ అని గుర్తుచేశారు. ఎమ్మెల్యే అనుచరులు సిర్పూర్ నియోజకవర్గంలో అటవీ అధికారిణిపై దాడి చేస్తే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అడ్డగూడూరులో దొంగతనం ఆరోపణలు వస్తే అరెస్టు చేసిన పోలీసులు, వందకోట్ల లిక్కర్ స్కాం చేసిందని ఆరోపణలు వచ్చిన కల్వకుంట్ల కవితను ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నించారు. పోడు భూమి సాగు చేసిన మహిళలను బట్టలు ఊడిపోతున్నా దాడి చేశారని, బాలింతలను అరెస్టు చేశారని, అదే పేదల భూములు, నోటిఫైడ్ భూములు కబ్జా చేసినవారిని ఎందుకు అరెస్టు చేయడంలేదని నిలదీశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడు బీబ్రలో జాతీయజెండా ఎగురవేసిన విధంగా, అదే స్పూర్తితో 2023లో నీలిజెండా ఎగురవేసి కోనప్ప నుండి విముక్తి కల్పిస్తామని తెలిపారు. సిర్పూర్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్, బిఆర్ఎస్ అంటూ ఎన్ని పెట్టినా ప్రజలు మీకు విఆర్ఎస్ ఇవ్వనున్నారని తెలిపారు. సిర్పూర్ పేపర్ మిల్ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. కాలుష్యం ప్రజలకిస్తూ లాభాలు మాత్రం కంపెనీ, పాలకులు పంచుకుంటున్నారని ఆరోపించారు. బహుజన రాజ్యంలో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని తెలిపారు. మన బహుజన బిడ్డలు కాంట్రాక్టర్లు, యజమానులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు కావాలంటే మన రాజ్యం రావాలన్నారు. జి.వో నెం 317 వల్ల ఆసిఫాబాద్ యువత తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. బిసిలకు గత ఎనిమిది ఏళ్లుగా కేవలం 2 వేల కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. విద్యార్థులకు కనీసం రియంబర్స్ మెంట్ కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఫాంహౌస్ పంటలకు ఒక ధర, పేదల భూముల్లో పండిన పంటలకు ఇంకో ధర ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు బండి సంజయ్ ఇవన్ని పట్టించుకోకుండా కులాలు, మతాల మధ్య చిచ్చులు పెడుతూ, మసీదులు తవ్వాలంటున్నారని విమర్శించారు. ఇలాంటి మాటలతో హిందూ ముస్లిం తెహజీబ్ చెడగొట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు క్షమించరని హెచ్చరించారు. దళిత బంధు పథకం రాష్ట్రంలో అందరికి రావాలంటే రెండు లక్షల కోట్ల బడ్జెట్ కావాలని,కానీ కెసిఆర్ జీతాలే ఇవ్వడంలేదని, బిల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా నేడు సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాగజ్ నగర్ లోని సర్సిలా, శిశుమందిర్ స్కూల్ వెనకగల డంపింగ్ యార్డుకు సంబంధించిన 9 ఎకరాల భూమి కెటిఆర్ మంత్రి అండదండతో కోనేరు కోనప్ప కబ్జా చేసి వెంచర్లు వేస్తున్నారని పేర్కొన్నారు. 2015లో మున్సిపాలిటీకి కేటాయించిన భూమిని నేడు అక్రమంగా ఆక్రమించారని మండిపడ్డారు. కెటిఆర్ నీకు దమ్ముంటే నీవు తెలంగాణ వాదివి అయితే ఆంధ్ర దొంగల నుండి ప్రభుత్వ భూమి కాపాడాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రైవేట్ ఎస్టేట్ కాదన్నారు. వెంటనే కలెక్టర్, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు రియంబర్స్ మెంట్ రావాలంటే,రైతుల పంటకు మద్దతు ధర రావాలన్నా, కౌలు రైతులకు న్యాయం జరగలన్నా మన రాజ్యం రావాలని తెలిపారు. తెలంగాణ కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలు నెరవేరలేదన్నారు. బహిరంగసభలో భాగంగా బియాని అపార్ట్ మెంట్స్ కాలనీ నుండి అంబేడ్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల అర్పించి, స్టేజి మీద గల మహనీయుల చిత్రపటాలకు పూలమాల అర్పించి బహుజనగీతం పాడి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి, సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జి అర్షద్ హుస్సేన్, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు మోర్ల గణపతి, నియోజకవర్గ సెక్రటరీ దుర్గం ప్రవీణ్, నియోజకవర్గ అధ్యక్షులు రాం ప్రసాద్, మహిళా నాయకురాలు జ్యోతి, రాంటెంకి నవీన్,vమండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.