* ట్రాఫిక్ & లా అండ్ ఆర్డర్ పోలీసు అధికారుల అభ్యంతరాల మేరకు ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశం
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిఎల్ వద్ద చేపడుతున్న జంక్షన్ అభివృద్ధి పనులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు ఆయా పనుల్లో నెలకొన్న ట్రాఫిక్ & లా అండ్ ఆర్డర్ అధికారుల అభ్యంతరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. దీంతో ఇబ్బందులు లేకుండా రీడిజైన్ రూపొందించి అందుకు అవసరమైన వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాలనగర్ లా అండ్ ఆర్డర్ ఏసిపి గంగారాం, ట్రాఫిక్ ఏసిపి చంద్రశేఖర్ రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ చెన్నారెడ్డి, ఈఈ గోవర్ధన్ గౌడ్, డిఈఈ రూపాదేవి, సిఐలు భాస్కర్, నరహరి, చంద్రశేఖర్, కన్సల్టెంట్ పూజిత, ఏఈ సంపత్, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏర్వ శంకరయ్య, నాయకులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.