నవతరం

తెలుగు దినపత్రిక

కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

ఘట్కేసర్, నమస్తే ఎల్లంపల్లి: ఘట్కేసర్ మున్సిపాలిటీ 1వ వార్డు పరిధిలోని కొండాపూర్ లో గల కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యమానికి ముఖ్య అతిధిగా వచ్చి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకురా మాల్లారెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, డీఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్, వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి, కమిషనర్ వేమన రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొంతం అంజి రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి, చిలుగురి హేమలత గోపాల్ రెడ్డి.

ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ వృద్దులకు కంటి పరీక్ష చేసి వారికి ఉచితం గా మందులు కంటి అద్దాలు అందజేశామని, అనంతరం తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుందని, ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుంది.రాష్ట్రంలోని పౌరులందరికి కంటి స్క్రీనింగ్, విజన్ పరీక్షను నిర్వహించడం కంటి అద్దాలను ఉచితంగా సమకూర్చడం సర్జరీలు, ఇతర చికిత్సలను ఉచితంగా ఏర్పాటు చేయడం సాధారణ కంటి వ్యాధులకు మందులను సమకూర్చడం హానికరమైన కంటి వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంటి వెలుగు కార్యక్రమం పీహెచ్‌సీ పరిసరాలు శుభ్రంగా ఉండడంతో పాటు నిబంధనల మేరకు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పకడ్బందీగా చేసిన ఆయా మెడికల్‌ ఆఫీసర్ మున్సిపల్ లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతున్నది. 18 ఏండ్ల పైబడిన వారందరూ కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొమ్మగోని రమాదేవి, బండారు ఆంజనేయులు గౌడ్, కడుపొల్లా మల్లేష్, ఎస్కె జహంగీర్, బేతల నర్సింగ్ రావు, కుతాది రవీందర్, ప్రభుత్వ వైద్యశాల సుపురిండెంట్ కొట్య నాయక్, వైద్యులు శోభన, సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మ రెడ్డి, ఆలయ ధర్మ కర్త నరేష్ గౌడ్, మున్సిపల్ మేనేజర్ అంజి రెడ్డి, మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్ ముదిరాజ్, బొక్క జంగా రెడ్డి, అన్ను భాయ్, పద్మ, సల్లూరి నర్సింగ్ రావు, మొయినార్టీ అధ్యక్షుడు కుతుబ్, బీసీ సెల్ అధ్యక్షుడు హరి శంకర్, బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు పడిగేమ్ వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ మందాడి శ్రీనివాస్ రెడ్డి, బొంత సుధాకర్, బీఆర్ఎస్ నాయకులు బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, సిరాజ్, సారా మురళి, కందకట్ల మాధవ రెడ్డి, బొక్క విష్ణు వర్ధన్ రెడ్డి, అస్లాం, పిట్ల విజయ్, బీఆర్ఎస్ కొండాపూర్ నాయకులు, వైద్యులు, ఏఎన్ఎం లు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading