జగద్గిరిగుట్టలో సాయిబాబా కళ్యాణ మండపంలో కంటి వెలుగును ప్రారంభించిన కార్పొరేటర్ జగన్
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మగ్దుమ్ నగర్ సాయి బాబా కళ్యాణ మండపం వద్ద కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈరోజు కార్పొరేటర్ జగన్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగును బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్ల చేయాలని కార్పొరేటర్ అధికారులను ఆదేశించారు. అనంతరం కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుందని, ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప కమీషనర్ వి.ప్రశాంతి, డిపిఓ హరిప్రియ, మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్ మమత, ఏఈ తిరుపతి, సి ఓ కిషోర్ కుమార్, సానిటేషన్ జవాన్ జిలాని పాషా, ఎస్ఎఫ్ఏలు కృష్ణమూర్తి చారి, వెంకటేష్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యువనాయకులు జైహింద్ నాయకులు మల్లేష్ గౌడ్, జనార్ధన్, ఆజం, మహమ్మద్, ఆంజనేయులు, ప్రభు, విగ్నేష్, శేఖర్, యాదగిరి, మనోజ్, సువర్ణ, శాంతి, పద్మ, జై శ్రీ, జిహెచ్ఎంసి ఆర్ పి లు తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.