నవతరం

తెలుగు దినపత్రిక

సర్వేంద్రియానాం నయనం ప్రధానం

* ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, నమస్తే ఎల్లంపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ లోగల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు అరేకపుడి గాంధీ, జోనల్ కమీషనర్ శంకరయ్య, డిప్యూటీ కమీషనర్ వెంకన్న, సంబంధిత వైద్యాధికారులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కంటి సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలు కంటి సమస్యలు ఉన్నవారు ఉచిత కంటి పరీక్ష శిబిరాలకు వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోవాలని, పరీక్షలు పూర్తయిన తర్వాత ఉచితంగా కంటి అద్దాలు మందులు పొందాలని, అవసరమైన వారికి కంటి పరీక్షల నిర్వహణ అనంతరం రీడింగ్ అద్దాలు అక్కడికక్కడే పంపిణీ చేస్తారు. దగ్గర చూపుగానీ, దూరం చూపు ఉన్నవారికి 15 రోజుల్లో తమ ఇంటికి అధికారులు కళ్లద్దాలను పంపిణీ చేస్తారని తెలిపారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేస్తారని అన్నారు. ‘సర్వేంద్రియానం నయానం ప్రధానం’ అన్న విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ లోని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్స్, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు, ఏరియా కమిటీ మెంబర్స్, బూత్ కమిటీ మెంబర్స్, బిఆర్ఎస్ శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading