నవతరం

తెలుగు దినపత్రిక

మున్సిపల్ అధికారులతో ఫిర్జాదిగూడ మేయర్ జక్కా సమీక్షా సమావేశం

హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న భువ‌న్ స‌ర్వేపై ప్ర‌జ‌ల‌కు సంపూర్ణ అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని పీర్జాదిగూడ మేయ‌ర్ జ‌క్క వెంక‌ట్ రెడ్డి మున్సిప‌ల్ అధికారుల‌ను ఆదేశించారు. భువ‌న్ సర్వే ఉద్దేశం, త‌ద్వారా వ‌చ్చే ఫ‌లితాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని బిల్ క‌లెక్ట‌ర్ల‌కు మేయ‌ర్ దిశా నిర్దేశం చేశారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం వివిధ విభాగాల (రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, అకౌంట్స్, శానిటేషన్, స్వచ్ఛ సర్వేక్షన్) అధికారులతో మేయ‌ర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. భువ‌న్ స‌ర్వేలో భాగంగా నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) తీసిన ఉపగ్రహ ఛాయచిత్రాల ఆధారంగా భవనాల సమాచారాన్ని డిజిటలైజ్ చేసే ప్రక్రియ కొన‌సాగుతుంద‌ని తెలిపారు. ఈ స‌ర్వే ద్వారా ప‌న్ను చెల్లింపుదారులు నిర్మించుకున్న‌ భవనం ఏ కేటగిరీలో ఉంది, ప్రస్తుతం ఏ కేటగిరీలోకి వస్తోంది, భవనంలో జరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలు ఏమిటీ, నల్లా, విద్యుత్‌ కనెక్షన్లు, జీఎస్టీ, ట్రేడ్‌ లైసెన్సు కలిగి ఉన్నారా? ఏదా..? అనే పూర్తి సమాచారాన్ని సేక‌రించి భువ‌న్ స‌ర్వేలో పొందుపరచడం జరుగుతుందనిమేయ‌ర్ తెలిపారు. తద్వారా ప్రజలకు పారదర్శకమైన‌ సేవ‌ల‌ను అందించడంతో పాటు మెరుగైన వ‌స‌తులను, స‌మ‌గ్ర మౌళిక సదుపాయాలు కల్పించడం జ‌రుగుతుంద‌ని మేయ‌ర్ అన్నారు.

రాష్ట్రమంత‌టా అమ‌లు
ప్రభుత్వం ప్రజలకు పారదర్శక సేవ‌ల‌ను, మెరుగైన మౌళిక సదుపాయాల అందించాలనే సంక‌ల్పంతో రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో భువ‌న్ స‌ర్వే చేసి ప‌న్నుల‌ను స‌వ‌రిస్తున్నారని అన్నారు. దీని వ‌ల‌న ఇంటి, ప్లాట్ల పూర్తి సమాచారాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జియో ట్యాగింగ్ చేసి డిజిటలైజ్ చేయ‌డంతో పాటు భువన్ సర్వే ద్వారా పట్టణ ప్రాంతాల్లోని అన్ని భవనాల సమాచారాన్నిన‌మోదు చేసి, ఆయా భవంతులను ఏ శ్లాబ్‌ కింద ఎంత పన్ను వసూలు చేయాలనేది నిర్ణయించడం జరుగుతుందన్నారు. గ‌తంలో ఆస్తి పన్ను మదింపులో శాస్త్రీయత పాటించకపోవడం, గృహ, వాణిజ్య కేటగిరీల నిర్ధారణలో హేతుబద్ధీకరణ లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడటంతో పాటు ప్రభుత్వ రికార్డుల్లో రెసిడెన్షియల్‌ ప్రాపర్టీగా న‌మోదు చేసి క్షేత్ర‌స్థాయిలో మాత్రం కమర్షియల్ వ్య‌పారాలు చేస్తున్నార‌ని, భువ‌న్ స‌ర్వే ద్వారా ఇలాంటి వాటిని స‌వ‌రించ‌డం జ‌రుగుతుంద‌ని త‌ప్పా విస్తీర్ణం,భ‌వ‌నం నిర్మాణంకు త‌గిన ప‌న్నుచెల్లిస్తున్న ప్ర‌జ‌ల‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని మేయ‌ర్ తెలిపారు.

త‌ప్పుడు ప్ర‌చారం త‌గ‌దు
ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల‌తో పాటు పీర్జాదిగూడ మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌లోను భువ‌న్ స‌ర్వే అమ‌లు చేసి యాదార్థంగా ప‌న్నుల‌ను స‌వ‌రిస్తుంటే కొంద‌రు వ్య‌క్తులు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ‌ప‌ట్టిస్తూ మున్సిపాలిటీలో ప‌న్నులు పెంచార‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఇలా చేయ‌డం త‌గ‌ద‌ని మేయ‌ర్ సూచించారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌పై అప‌నింద‌లు వేయ‌డం మానుకోవాల‌ని మేయ‌ర్ హెచ్చరించారు. లేనిపోని అపోహలు ప్రజల్లో సృష్టిస్తు గందరగోళానికి గురిచేస్తున్నారని కావున ఇట్టి అంశాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు క్షుణ్ణంగా అవగాహన కల్పించాలని అధికారులకు మేయ‌ర్‌ సూచించారు. ప్రజలు ఆస్తి పన్ను చెల్లించే విషయంలో ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉన్నా నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి సంబందిత అధికారులతో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని మేయ‌ర్ జ‌క్క వెంక‌ట్ రెడ్డి సూచించారు. అలాగే ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, అకౌంట్స్, శానిటేషన్, స్వచ్ఛ సర్వేక్షన్ అంశాల‌పై మేయ‌ర్ స‌మీక్షించారు. ప్ర‌భుత్వ అభివృద్ధి కార్య‌క్ర‌మాల అమ‌లులో అధికారులు నిర్ల‌క్ష్యం వ‌హించ‌వ‌ద్ద‌ని మేయ‌ర్ అధికారుల‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ జ్యోతి,సానిటరీ ఇన్స్పెక్టర్ జానకి, సీనియర్ అసిస్టెంట్ జగన్ మోహన్, బిల్ కలెక్టర్లు, వార్డ్ ఆఫీసర్లు , రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading