పరకాల, నమస్తే ఎల్లంపల్లి: పరకాల నియోజికవర్గంలో పలు గ్రామాలలో నూతనంగా నిర్మించిన బీజేపీ గద్దె వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. పార్టీ కార్యాలయలు ప్రారంభించారు.
పరకాల కార్యకర్తల సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ..
ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టు.. కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీయటానికి పోయినట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ప్రజలు మూడు పువ్వులు ఆరు కాయలుగా బతుకుతున్నట్టుగా.. నేను వెలగబట్ట వలసింది తెలంగాణలో కాదు దేశంలో అని మాట్లాడుతున్నాడు. కెసిఆర్ అదే ఊకదంపుడు ఉపన్యాసం తప్ప ఎక్కడ కూడా కొత్తదనం లేదు.

ఐదు సంవత్సరాలలో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పిన కెసిఆర్.. గుడిసెల్లో, ప్లాస్టిక్ షీట్ల కింద బ్రతికే వారికి డబుల్ బెడ్ రూం కట్టిస్తా అన్నారు. మోదీ మూడు కోట్ల ఇళ్ళు కట్టిస్తే.. కెసిఆర్ మాత్రం తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల సమయంలో ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు. 2014 లో ఐదున్నర లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు తగ్గిస్తున్నారు. ధరలు పెరిగాయి అనే సోయి కూడా కెసిఆర్ కి లేదు. పేదల పట్ల కెసిఆర్ ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు. కెసిఆర్ వి మోసపు మాటలు.

నాట్లు వేసే వాళ్ళను కౌకొండలో కదిలిస్తే..
మాకు కేసీఆర్ ఇచ్చిన హామీలు దేవుడు ఎరుగు.. దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు, మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నారు.. దళిత బంధు ఇస్తానన్నారు..ఇవన్నీ గంగలో పోనీవ్వు. కానీ కూలి పని చేసుకుని ఇంటికి పోతే మా గుడిసెల్లో కరెంటు ఉండటం లేదు. వైర్లు కట్ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్లు బంద్ చేస్తున్నారు. మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. చీకట్లో మగ్గండి అని హుకుం జారీ చేస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా దళిత గుడిసెలకు, దళిత గూడేలకు కరెంటు ఆపే హక్కు నీకు ఎక్కడిది అని అడుగుతున్నారు. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతా అంటున్నారు.
గతంలో రెండు నెలలకు ఒకసారి బిల్లు వచ్చేది కానీ ఇప్పుడు నెల నెలలకు బిల్లు వస్తుంది. 183 రూపాయల బిల్లు వస్తే దానికి అడిషనల్ కన్సెంప్షన్ డిపాజిట్ పేరుతో 2211 రూపాయలు వేశారు.
కెసిఆర్ పెన్షన్ ఇవ్వగానే, కల్యాణ లక్ష్మి ఇవ్వగానే.. సంబరపడ్డాము. తెలంగాణ బిడ్డల్లారా కలుపులు తీసే దగ్గర, పత్తి ఏరే దగ్గర, చావళ్ల దగ్గర కెసిఆర్ చేస్తున్న పనులను చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు మిమ్మల్ని అడుగుతున్నా.. పెన్షన్ల పేరిట తొమ్మిది వేల కోట్లు, కల్యాణలక్ష్మి పేరిట రెండు వేల కోట్ల రూపాయలు, రైతుబంధు పేరుతో 11 వేల కోట్ల రూపాయలు మొత్తం కలిస్తే కూడా సంవత్సరానికి పేదల కోసం ఇచ్చే డబ్బు 25 వేల కోట్ల రూపాయలు. కానీ మద్యం అమ్మి కేసీఆర్ సంపాదిస్తున్న డబ్బు 45 వేల కోట్లు. ప్రతి 200 మందికి ఒక బెల్ట్ షాపును పెట్టారు.
తాగి తాగి యువకులు చచ్చిపోతే పుస్తెలు తెగిన ఆడపిల్లలు, అనాధలుగా మిగిలిపోయిన చిన్న పిల్లలు ప్రతి ఊర్లో ఎదురుపడుతున్నారు. వీరి కన్నీరు ఉసురు కెసిఆర్ కి తగులుతుంది.
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో కెసిఆర్ గుంజుకుంటున్నారు
ఎక్కడో పంజాబ్లో రైతులు చచ్చిపోతే కేసీఆర్ వెళ్లి డబ్బులు ఇచ్చి వస్తున్నారు. ఇక్కడ పేదవారు ప్రమాదవశాత్తు చచ్చిపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. రైతుల దగ్గర పనిచేసే కూలీలు, జీతగాళ్లు, ఆటో నడుపుకునేవారు, కూలీ చేసుకుని బ్రతుకేవారు ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల రూపాయలు వస్తుందా? ఇక్కడ మాత్రం ఇవ్వడు కానీ పంజాబ్, హర్యానా వెళ్లి డబ్బులు ఇచ్చి వస్తాడు. తెలంగాణ ప్రజలను మాత్రం పట్టించుకోడు. ఇది కేసీఆర్ దుర్నీతి.

సంస్థలను అమ్మేది మోడీ కాదు కేసీఆర్. ఆర్టీసీ బస్సులు.. పేద రైతుల కూరగాయలను, పాలను, పేద పిల్లలు స్కూల్కు పోవడానికి ఏకైక రవాణా సదుపాయం. వేలకోట్ల రూపాయల ఆదాయం ఉన్న తెలంగాణలో ఒక 3 వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సంస్థను ఎందుకు ఆదుకోవడం లేదు. తెలంగాణ వచ్చినప్పుడు 10300 బస్సులు ఆర్టీసీలో ఉంటే అందులో 1000 రూపాయలు మాత్రమే ప్రవేటు బస్సులు ఉండేవి.. కానీ ఇప్పుడు 9 వేల బస్సులు ఉంటే 3,000 బస్సులు ప్రైవేట్ కి లీజుకు ఇచ్చారు. గ్రామాల నుంచి పట్టణాలకు పోవడానికి పేదవానికి రవాణా సదుపాయం లేకుండా చేసి.. వారి కళ్ళలో మట్టి కొట్టి..ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి.. బస్సు లేని ఊర్లుగా మార్చేశారు.
20 ఏళ్లు చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఎన్నికల సమయంలో మాత్రమే నోటిఫికేషన్లు వస్తాయి తప్ప భర్తీ జరగదు. అనేక ఊర్లలో యువకులు ఉద్యోగాలు రాలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువుకున్న పిల్లలకు నెలకు 3016 రూపాయలు ఇస్తానని చెప్పి ఎక్కడ ఇవ్వలేదు.

పోలీసులు పైన్ల మీద ఫైన్లు వేస్తున్నారు
పోలీసుల పనులు రెండే ఉన్నాయి.. ఫైన్లు వేసి ప్రజల దగ్గర డబ్బులు గుంజాలి.. రెండోది టిఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను మంచిగా చూసుకొని వేరే పార్టీ వాళ్ళని కొట్టాలి, కేసులు పెట్టాలి. పోలీసులారా మీకు జీతం వచ్చేది తెలంగాణ ప్రజల రక్తమాంసాలతో కట్టిన టాక్స్ ల వల్ల కెసిఆర్ మీకు జీతం ఇవ్వటం లేదు.. మీరు ప్రజలకు జీతగాళ్లు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఉండేది 2023 డిసెంబర్ వరకు మాత్రమే అని మర్చిపోకండి.. తర్వాత వచ్చేది భారతీయ జనతా పార్టీనే. మేము పోలీస్ స్టేషన్ల వారీగా.. ప్రభుత్వ ఆఫీసుల వారీగా.. లెక్క పెట్టుకుంటున్నాము. దానికి తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి. చట్ట ప్రకారం పనులు చేయండి.
సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులారా కేసీఆర్ పాలనలో మీ బ్రతుకులు ఎలా అయ్యాయో చూసుకోండి. చేసిన పనులకు డబ్బులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
తెలంగాణలో ఈ అరిష్టం పోవాలంటే.. మనకు గౌరవం దక్కాలంటే కెసిఆర్ ప్రభుత్వం పోవాలి.
దళితబంధు తెరాస చెంచాగాల్లకు ఇస్తున్నారు తప్ప నిజమైన పేద వారికి ఇవ్వడం లేదు.

కడుపు రగిలిపోతుంది, గుండె పగిలిపోతుంది.. ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పోగొట్టాలని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. పెన్షన్లు, రైతుబంధు గెలిపించదు. తెగిపడ్డ పుస్తెల తాళ్ళ సాక్షిగా కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుంది.
నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో నిజమైన బంగారు తెలంగాణను సాధించుకుందాం. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఉద్యోగాలు, అభివృద్ధి, ప్రజలకు అండగా ఉండే బాధ్యతయితమైన ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెచ్చుకుందాం. ప్రజలందరూ నిండు మనసుతో ఆశీర్వదించండి అని ఈటల రాజేందర్ అన్నారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.