నవతరం

తెలుగు దినపత్రిక

అథ్లెట్స్ ను అభినందించిన ఎమ్మెల్యే వివేక్

మార్చ్ ఫాస్ట్ లో మొదటి స్థానంలో నిలిచిన మేడ్చల్-మల్కాజ్ గిరి అథ్లెట్స్ ను అభినందించిన ఎమ్మెల్యే…

మెదక్ / మేడ్చల్ జిల్లా, నమస్తే ఎల్లంపల్లి: మెదక్ లో ఈ నెల 21, 22న జరిగిన 9వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ చాంపియన్షిప్ లో సుమారు 150 మంది వివిధ వయస్సు గల అథ్లెట్స్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి పాల్గొనగా.. మెన్ & ఉమెన్ మార్చ్ ఫాస్ట్ లో మేడ్చల్ మల్కాజ్ గిరి అథ్లెట్స్ మొదటి స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను తన నివాసం వద్ద ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, సెక్రెటరీ రత్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading