• అధిష్టానం ఆదేశిస్తే పాలకుర్తి నుంచి పోటీ
• పీసీసీ సభ్యుడు లక్ష్మీనారాయణ
పెద్దవంగర, నమస్తే ఎల్లంపల్లి: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని పీసీసీ సభ్యుడు డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్య నాయక్ అన్నారు. మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అధ్యక్షతన గురువారం ఆయన నివాసంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర దేశ చరిత్రలో నిలుస్తుందన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసమే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నాడని తెలిపారు. ప్రధాని మోడీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. హాథ్ సే హాథ్ జూడో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్ట చేయడం కోసం నాయకులు ఐక్యంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉందని, కార్యకర్తలు అధర్య పడవద్దని, పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ ధ్యేయంగా కార్యకర్తలు కలిసి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మెట్టు నగేష్, సర్పంచ్ జగ్గా నాయక్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు హరికృష్ణ, నాయకులు పూర్ణచందర్, శ్యామ్, సీతారాం నాయక్, రంగు మురళీ, ఇస్లావత్ రవి, వేణు, రాంబాబు, సతీష్, చెరుకు సత్యం, మహేష్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకల సమ్మయ్య గౌడ్, వినోద్ పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.