ఢిల్లీ.
రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తామని చెప్తున్నారు. తెలంగాణలో ఏ గ్రామంలో అయినా రైతులు 24 గంటల కరెంటు వస్తుంది అని చెప్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కళ్ళు నెత్తికెక్కి, ఆహంకారం ఎక్కి, బలుపెక్కి దమ్ముందా అని ఛాలెంజ్ చేస్తున్నారు.. దమ్ములేనిది మీకు.. రండలై ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు.
రాజకీయాలకు కొత్త అయిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీలో హాస్పిటల్స్, స్కూళ్లను పరిశీలించి దీనిని మా రాష్ట్రంలో అమలు చేస్తాను అని చెప్పడానికి కేసీఆర్ కి సిగ్గు ఉండాలి.
ఈ దేశంలో తెలంగాణ భాగం కాదు అన్నట్టు, ఒక దేశం అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదు. తెలంగాణ నీ తాత జాగరు కాదు అని మర్చిపోవద్దు.
నేను పార్టీలు మారేవాన్ని కాదు. పూటకో ఒక వేషంవేసే వాడిని కాదు. సంవత్సరానికి ఒక జెండా కప్పుకునేవాన్ని కాదు.
నా మీద ఎవరి సానుభూతి అక్కర్లేదు.
నా మీద ప్రజల సానుభూతి ఉంది.
– ఈటల రాజేందర్.
ఢిల్లీ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పాల్గొన్న ఏనుగు రవీందర్ రెడ్డి, తుర్క నరసింహులు.
అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ అని ప్రపంచమంతా కొనియాడుతుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు, దేశ ప్రజానీకానికి స్ఫూర్తి నింపే రోజు. కానీ తెలంగాణ ప్రభుత్వం జనవరి 26 ను నిర్వహించకపోవడం సిగ్గుచేటు.
ఈ జనవరి 26 న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజ్యాంగం పట్ల వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్చాకరంగా ఉంది.
కెసిఆర్ గారి ఏలుబడిలో ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు.. ఎమ్మెల్సీలు గవర్నర్ గారి పట్ల వాడిన భాష, మాట్లాడిన తీరు చూసి యావత్ మహిళా లోకం సిగ్గుతో తలదించుకున్నది.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, గవర్నర్, ముఖ్యమంత్రి పదవులు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన పదవులు, వచ్చే గౌరవం వ్యక్తిగతమైనది కాదు. ఆ కుర్చీకి ఇచ్చే గౌరవం.గవర్నర్ గారిని అవమానపరచడం అంటే రాజ్యాంగాన్ని అవమానపరచడం, మహిళలను అవమానపరచడం.
కెసిఆర్ గారు గవర్నర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదు తెలంగాణ ఏర్పడినప్పుడు ఉన్న గవర్నర్ కి హోదా మరిచిపోయి సాష్టాంగ నమస్కారం చేసిన వ్యక్తి. వందలసార్లు గవర్నర్ గారి దగ్గరికి పోయి వచ్చిన వ్యక్తి. కానీ సౌందర రాజన్ గారు..ఒక మహిళా గవర్నర్ వచ్చిన తర్వాత ఆమె పట్ల వ్యవహరించిన తీరు సభ్యసమాజం గమనిస్తుంది.
ఏమన్నా ఇబ్బందులు ఉంటే ముఖ్యమంత్రులే దానిని పరిష్కరించుకుంటారు. కేరళలో సమస్యలుంటే ముఖ్యమంత్రులు పరిష్కరించుకుంటున్నారు తప్ప రిపబ్లిక్ డే ను బహిష్కరించలేదు. తమిళనాడులో, ఢిల్లీలో ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్నా కూడా గవర్నర్లను కించపరిచే విధంగా మాట్లాడలేదు. ఉత్సవాలను నిషేధించలేదు.
గణతంత్ర ఉత్సవాలను నిషేధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకు ఎక్కింది. దీనిమీద కేంద్ర హోం మంత్రి గారికి మాలాంటి బాధ్యతగలగా ప్రజాప్రతినిధులు విన్నవిస్తాము.
నేను ఫ్యూడల్ వ్యవస్థలో పుట్టినాను అని కెసిఆర్ చెప్పుకున్నారు. దొరలెక్క మాట్లాడుతున్నావు అని దేవేందర్ గౌడ్ గారు ప్రశ్నిస్తే అవును నేను దొరనే అని సమాధానం చెప్పారు. దొరల వ్యవస్థలో పురుషాధిక్యత ఉంటుంది. స్త్రీల పట్ల చులకన భావన ఉంటుంది. సంకుచిత వ్యవహారం ఉంటుంది. అందుకే కాబోలు ఐదు సంవత్సరాల కాలంపాటు మహిళమంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఘనుడు కేసీఆర్. ఒక్క ఎస్సీ మహిళ, ఒక్క బీసీ మహిళ ఎమ్మెల్యేలు లేకుండా శాసనసభ నడుపుతున్న వ్యక్తి కెసిఆర్. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని మమ అనేలా తీర్మానం చేస్తున్నారు తప్ప ఆచరణ మాత్రం లేదు.
బొడిగశోభ గారు ఉద్యమకారిణి, ఒకే ఒక్క మహిళ ఎమ్మెల్యే ఉంటే ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఈ మహిళ నా చెప్పుచేతుల్లో ఉండదు, బానిసత్వంలో ఉండదు. ప్రశ్నించేతత్వం ఉంటుంది.. ప్రశ్నించే వారు ఉండవద్దు అని ఉన్నొక్క గొంతును నొక్కి మహిళా జాతిని అవమానపరిచిన వ్యక్తి కెసిఆర్.
మహిళలపట్ల ఎంత చులకన భావన ఉందో.. కొన్ని ఉదాహరణలు..
సరూర్ నగర్ లో ఒక అనాధ స్కూల్ ఉంది. అక్కడ ఒకటే టాయిలెట్ ఉంది. 400 మంది బాలికలకు టాయిలెట్ పోవడానికి లేకుండా చెంబుపట్టుకుని బయటికి పోవాల్సి వస్తుందని వార్తలు రాసినా పట్టించుకోరు..
సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో ఆడపిల్లలు టాయిలెట్లు లేకపోవడం వల్ల, మంచినీళ్లు తాగడం లేదు..యూరిన్ రాకుండా టాబ్లెట్లు వేసుకుంటున్నారు అనే వార్త సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంపదకు కొదవలేదని అన్ని రంగాల్లో దూసుకుపోతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన కేసీఆర్.. రాజకీయాలకు కొత్త అయిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీలో హాస్పిటల్స్, స్కూళ్లను పరిశీలించి దీనిని మా రాష్ట్రంలో అమలు చేస్తాను అని చెప్పడానికి కేసీఆర్ కి సిగ్గు ఉండాలి.
కేంద్ర మంత్రిగా.. రాష్ట్రమంత్రిగా.. ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి.. తెలంగాణ అణువణువు తెలిసిన వ్యక్తి.. తెలంగాణ బాధలు ఏందో, తెలంగాణ సమస్యలు ఏందో నాకు తెలవదా అని చెప్పిన వ్యక్తి.. ఢిల్లీ వచ్చి పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ముఖ్యమంత్రి, ఆయన చెంచాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
జగిత్యాలలో మున్సిపల్ చైర్మన్ శ్రావణి ఏడుస్తుంది.రాజీనామా చేసింది. ఒక మహిళా చైర్మన్ అని చెప్పి అక్కడ ఉన్న మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నారని ఏడుస్తున్నారు. మహిళల పట్ల ఎంత చులకన భావన ఉందో అర్థం కావాలి.
ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రావడం లేదని.. అమ్మ నేను చనిపోతున్నా అని ఉత్తరం పెట్టి ఖమ్మంలో రైలు కింద పడ్డ ముత్యాల సాగర్ ఉత్తరం మీ పాలనకు సజీవ సాక్ష్యం. సంగారెడ్డిలో.. ఉన్న ఒక్క ఎకరం అసైన్మెంట్ భూమి గుంజుకుంటున్నారని ఆత్మహత్య చేసుకున్న 19 సంవత్సరాల విద్యార్థి రాసిపెట్టిన ఉత్తరం సాక్షి. కెసిఆర్ సొంత జిల్లా సిద్దిపేటలో ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించిన రమేష్ డబుల్ బెడ్ రూమ్ రావటం లేదని స్వయంగా వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. రాములు అనే రైతు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా కామారెడ్డిలో చనిపోయిన సంగతి తెలియదా?
ధరణి వల్ల ఉత్పన్నమైన సమస్యలు ఆర్డిఓ, కలెక్టర్ల కాళ్లు పట్టుకున్నా పరిష్కారం కాక.. కోర్టుకు ఫీజులు కట్టలేక.. కన్నీళ్ల పర్యవంతమై ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలియడం లేదా ?
రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తామని చెప్తున్నారు. తెలంగాణలో ఏ గ్రామంలో అయినా రైతులు 24 గంటల కరెంటు వస్తుంది అని చెప్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్తున్నాను.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కళ్ళు నెత్తికెక్కి, ఆహంకారం ఎక్కి, బలుపెక్కి దమ్ముందా అని ఛాలెంజ్ చేస్తున్నారు.. దమ్ములేనిది మీకు.. రండలై ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మోటర్లు కాలిపోని, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోని, కంటి రెప్పపాటు పోకుండా విద్యుత్ ఇస్తే దేనికంటే దానికి చాలెంజ్ చేస్తున్నాను.
గిరిజనకాలనీల్లో, హరిజనవాడలలో మీటర్లు లేవని.. దళితబస్తీలకు కరెంటు కట్ చేసి దళితులను అంధకారంలో ముంచుతున్న దుర్మార్గులు మీరు కాదా? ఫైన్లు వేస్తున్న మాట వాస్తవం కాదా?
ఢిల్లీలో అన్ని రాష్ట్రాల సంస్కృతిక శాఖకు సంబంధించిన శఖటాలను ప్రదర్శించారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన శఖటాలు కనిపించలేదు. అంత సంకుచితంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారు. ట్రేడ్ ఫెయిర్ జరుగుతున్నాయి, అందులో కూడా పాల్గొనడంలేదు.
ఈ దేశంలో తెలంగాణ భాగం కాదు అన్నట్టు,తెలంగాణనే ఒక దేశం అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలు భారత రాజ్యాంగానికిలోబడే కొనసాగాలి తప్ప భిన్నంగా కొనసాగడానికి అవకాశం లేదని కేసిఆర్ గుర్తుపెట్టుకోవాలి. నీ తాత జాగరు కాదు అని మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను.
గవర్నర్ గారిని అవమానించడం కంటే ఏదైనా సమస్యలు ఉంటే చర్చించండి. ఆమె అడుగుతున్న విశాల పట్ల దృష్టి పెట్టండి.
ప్రధానమంత్రి గారు ఒక ఆదివాసి బిడ్డను రాష్ట్రపతిగా చేశారు. రాష్ట్రపతి గారికి విదేశీ వ్యవహారాల గురించి, అంతర్గత భద్రత, ఆర్మ్డ్ ఫోర్స్ విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రికి సంస్కారం సభ్యత లేదు.. చివరికి ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులను అవసరం లేకున్నా యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని చట్టు బండలు చేస్తూ.. బిఎస్పి పార్టీని, సిపిఐ, తెలుగుదేశం చివరికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా మింగేశారు.
భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులుగా మేము లొంగి పోకపోతే, ఆయన అడుగులకు మడుగులు ఒత్తకపోతే.. ఆయనను నిలదీసిన పాపానికి.. నేను గెలిచి 13 నెలలవుతున్నా ఒక్కనాడు కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. పైగా దయ్యాలు వేదాలు వల్లించినట్టు కేంద్రం మీద పడుతున్నావు.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నవు.
ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్న.. రాచరికపు, కుటుంబ పాలనను రాష్ట్రం మీద రుద్దుతున్న ఏకైక వ్యక్తి కేసీఆర్.
కేసీఆర్ బానిసలు, కేసీఆర్ సంధించిన సైకో శాడిస్టులు మా మీద మాట్లాడినంత మాత్రాన మా ఖరెజ్ దెబ్బతినదు. ఆ మాటలు మరింత స్ఫూర్తిగా తీసుకొని కొట్లాడుతాము.
స్వయంగా ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి చెప్పారు.. కెసిఆర్ ఆయన మంత్రులు మాట్లాడుతున్న భాష, తిట్ల పురాణాలు ఆశీర్వాదం లెక్క ఉన్నాయి. అవి నాకు డైజెస్ట్ అవుతున్నాయి.. ప్రోటీన్లగా పనిచేస్తున్నాయని.
ఈ ముఖ్యమంత్రి నేనా.. మేము ఎన్నుకుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. కేసీఆర్ గారు 2023 డిసెంబర్ తర్వాత కొనసాగే ఆస్కారమే లేదు. తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో తెలంగాణ నిరంకుశత్వాన్ని, కేసీఆర్ అహంకారాన్ని, మహిళా వ్యతిరేకతను బొందపెట్టి తీరుతామని అనుకుంటున్నారు.
Q&A:
నేను పార్టీలు మారేవాణ్ణి కాదు. నా 20 ఏళ్ల చరిత్ర మీకు తెలిసు. కెసిఆర్ గారు వెళ్లగొట్టిన తర్వాతనే ఇంకో పార్టీలోకి వెళ్లాను. కేసీఆర్ గారు వెళ్లగొట్టిన తర్వాత నన్ను అక్కున చేర్చుకొని ఆదుకున్న పార్టీ బిజెపి. నేను రాజీనామా చేసి పోలేదు. నేను పార్టీలు మారేవాణ్ణి కాదు. పూటకో ఒక వేషం వేసే వాడిని కాదు. సంవత్సరానికి ఒక జెండా కప్పుకునేవాన్ని కాదు.
కెసిఆర్ గారు తాను పెద్దగా అవ్వడానికి ప్రయత్నం చేయడు. ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేయడు. మంచి పనులు చేసి మళ్లీ గెలిచే ప్రయత్నం చేయడు. ఇతర పార్టీలను చిన్నగా చేయడం ద్వారా ఇతర పార్టీలను గందరగోళం సృష్టించడం ద్వారా.. తాను గెలిచే ప్రయత్నం చేస్తాడు. ఆయన అన్ని పార్టీలలో కోవర్టులను పెట్టుకుని సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తారు.
ఇలానే బీఎస్పీ, cpi, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలను మింగాడు. ఇవన్నీ దానికి సజీవ సాక్ష్యం. కెసిఆర్ నమ్ముకున్నది ఇంటిలిజెంట్ వ్యవస్థను, ఆయన నమ్ముకున్నది కుట్రలను, నమ్ముకున్నది ప్రలోభాలను, నమ్ముకున్నది డబ్బు సంచులను, నాయకులకు వెలగొట్టి కొనుక్కొనే కల్చర్ ఆయనది.
నామీద ఎవరి సానుభూతి అక్కర్లేదు.
నా మీద ప్రజల సానుభూతి ఉంది.
నేను బిజెపికి వచ్చిన తర్వాత 800 కోట్లు కేసిఆర్ ఖర్చు పెట్టిండు. కెసిఆర్ ఎన్నో కుట్రలు చేసిన హుజూరాబాద్ ప్రజలు నన్ను కడుపులో పెట్టుకున్నారు. తెలంగాణ ప్రజలకు కూడా నా చరిత్ర తెలుసు కాబట్టి వారి ఆశీర్వాదం నా మీద ఉంటుంది.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.