కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వైయస్సార్ టిపి బలోపేతం అవుతుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా మెజార్టీ సాధించి విజయం సాధిస్తామని వైఎస్సార్టీపీ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ సాతాల గోపాల్ అన్నారు. షాపూర్ నగర్ ప్రధాన చౌరస్తా వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహాన్ని శుభ్రం చేసి పాలతో కడిగారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమైన గోపాల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సురేష్ రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపడతామని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షురాలు షర్మిల నాయకత్వంలో తప్పకుండా తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బి ఆర్ ఎస్ కుట్రలు కుతంత్రాలు చేసిన వైయస్సార్ టిపి ఆపలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కె.వెంకటేష్, రామకృష్ణ, నరసింహారెడ్డి, శ్రీను, గణేష్, రవి, రాఫీక్, జోన, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.