* తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఆయన లేఖ రాస్తూ ఈ కింది విధంగా రాశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి నమస్కారం.
విషయం: 2009 బ్యాచ్ పోలీసు ఎస్ఐ ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇవ్వకుండా అన్యాయానికి గురిచేయడం గురించి… దయచేసి దీన్ని ఓపికగా చదవండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్ ద్వారా తెలంగాణకు చెందిన హైదరాబాద్ రేంజ్(మల్టిజోన్ 2) నుండి 434 మంది, వరంగల్ రేంజ్(మల్టిజోన్ 1) నుండి 150 మంది ఎస్ఐ ఉద్యోగాలు పొందారు. ఇప్పటివరకు వరంగల్ రేంజ్ కు చెందిన 150 మంది, హైదరాబాద్ రేంజ్ కు చెందిన 220 మంది ఎస్ఐ లు ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు. అంతేకాకుండా 2012 సంవత్సరంలో ఎస్ఐ లుగా ఉద్యోగాలు పొందిన 40 మంది ఎస్ఐలు కూడా పదోన్నతి పొందారు. కానీ 2009 బ్యాచ్ కు చెందిన మిగిలిన 214 మందికి మాత్రం ఇప్పటివరకు ప్రమోషన్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. దీని వల్ల సొంత బ్యాచ్ కు చెందిన మిత్రులు,జూనియర్లు వీరికి పై అధికారులయ్యారు.ఇది 214 మంది ఆత్మగౌరవ సమస్యగా మారి,మానసికంగా వేధిస్తున్నది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 317 జీవో తీసుకొచ్చిన అనంతరం,తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్ర డిజిపి గారు సర్వీస్ రూల్స్ మార్చి, ఒకే రాష్ట్రం ఒకే పదోన్నతి అనే విధంగా నూతన విధివిధానాలు రూపొందించారు. కానీ ఆ విధివిధానాలకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి వద్ద పెండింగ్ లో ఉంది. నూతన రూల్స్ ప్రకారం మరియు పాత రూల్స్ ప్రకారం ఏ రూల్ ప్రకారమైనా 2009 బ్యాచ్ ఎస్ఐలకు ప్రమోషన్స్ ఇవ్వడం న్యాయబద్దమైనదే. ఈ అంశంపై అన్యాయానికి గురైన 200 మంది ఎస్ఐలు నన్ను కలిశారు. గత ఒకటిన్నర సంవత్సరం కాలంగా పోలీసు డిపార్టుమెంటు కు చెందిన అనేక మంది ఉన్నతాధికారులను కలిసి 46 వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మీరు నివాసం ఉంటున్న ప్రగతిభవన్ ను కూడా వీరే కంటికి రెప్పలా కాపాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడుతూ, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ రాష్ట్రాన్ని రక్షిస్తున్న పోలీసులకు సంబంధించిన ఫైలును కూడా పట్టించుకోకపోతే ముఖ్యమంత్రిగా మీరెందుకున్నట్లు.? నెలకు రూ.4.25 లక్షల జీతం తీసుకుంటూ ప్రజలకు, ఉద్యోగులకు న్యాయం చేసే ఫైల్స్ ను చూడకుండా ప్రగతిభవన్ లో ఏం చేస్తున్నారు? అసలు తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్నారా? లేదా? అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది. పోలీసుల్లో ఎప్పుడూ అశాంతి ఉండకూడదు.వాళ్లు ఎలాంటి తప్పు చేయకపోయినా ప్రమోషన్స్ ఇవ్వకుండా శిక్షించడం వలన వారు అసహనానికి గురవుతారు.తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గమనించగలరు. అందుకే 2009 బ్యాచ్ కు చెందిన 214 మంది ప్రమోషన్స్ కి అర్హులైన ఎస్ఐలకు,ఖాళీలు ఉన్న చోట వెంటనే ప్రమోషన్స్ కల్పించాలని బిఎస్పి డిమాండ్ చేస్తుంది. లేనిపక్షంలో పోలీసు ఉద్యోగులకు న్యాయం కోసం బిఎస్పి పోరాటానికి సిద్ధంగా ఉందని మీకు తెలుపుతున్నాను.








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.