పిట్లం / కామారెడ్డి, నమస్తే ఎల్లంపల్లి: జుక్కల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై పత్రికా సమావేశంలో డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… తెలంగాణలో విచ్చలవిడి దోపిడి జరుగుతుందన్నారు. స్కీంలన్ని స్కాంలుగా మారాయి, స్కాంల ద్వారా వేలకోట్లు దోచుకున్నాయి, దేశంలో నేను ప్రధాని అభ్యర్థి అయితే ఎన్నికల ఖర్చుతో నేనే పెడతా అన్నారు అంటే ఎన్ని వేల కోట్లు దోచుకొని సంపాదించారో తెలుస్తుందన్నారు ఆర్ఎస్పీ. అందుకే ఈడి, సిబిఐ, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలి. ఆస్తులపై.. ఈ ఆస్తులు ఎలా వచ్చాయో తేల్చాలి… ఇప్పటికీ ఒకపక్క ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు.. ఫించన్లు ఇవ్వలేదు. మరోపక్క ఇన్ని వేల కోట్ల ఆస్తి ఎక్కడిది, మోడీ అదానితో కలిసి దేశాన్ని దోచుకున్నట్లే.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి కేంద్రంలో అధికారం ఉన్న బిజెపి పార్టీ దోచుకున్నట్టే.. కెసిఆర్ తెలంగాణను దోచుకున్నారు. కవిత లిక్కర్ స్కాం కేవలం సముద్రంలో ఒక చుక్కలాంటిది మాత్రమేనని అన్నారు. 10 వ తరగతి పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేని విద్యా శాఖ మంత్రి అవసరమా అని ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి, ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాలి. 80 వేల ఉద్యోగాల ప్రకటన చేసి, దొంగచాటుగా ఒక్కో ఉద్యోగం పది లక్షల నుండి కోటి వరకు అమ్ముకున్నరని తెలిపారు. బిఎస్పి పార్టీ ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ లీకెజి విషయాన్ని బయటకు తెచ్చిందని గుర్తుచేశారు. సిబిఐ విచారణ జరిపి, అసలైన దోషులను అరెస్ట్ చేయాలని బిఎస్పి పార్టీ తరుపున రాష్ట్రపతికి లేఖ రాశామని తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగులను నిండాముంచిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత ప్రభుత్వం కోల్పోయింది. ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసింది, బిసి రిజర్వేషన్లు పెంచకకుండా మోసం చేసింది. ఎస్సీ వర్గాల అభివృద్ది కోసం ఖర్చు చేయాల్సిన డబ్బుతో ఫాంహౌస్, భంగళాలు కట్టుకున్నారని, అన్ని వర్గాలను మోసం చేసి, ఇపుడు అంబేడ్కర్ విగ్రహం పెట్టి, మేం అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఆరోజు ఈ విద్యార్థులు లేకపోతే ఈ తెలంగాణ వచ్చేదా? మీరు ప్రగతి భవన్ వెళ్లేవారా? మీకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు వచ్చేవా? 1200 కోట్లతో సెక్రటేరియట్ నిర్మించేవారా అని ప్రశ్నించారు. పదవుల్లోకి వచ్చాక ఈ రోజు విద్యార్థులనే మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హై కోర్టు జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో కూడా చాలా అవకతవకలు జరిగాయన్నారు. పలుచోట్ల సాంకేతికలోపం అని చెప్పి, తర్వాత పరీక్ష వాయిదా పడిందని అబద్దాలు చెప్పారని తెలిపారు. దీనిపై ప్రశ్నించిన బిఎస్పి నాయకులను సూర్యపేటలో అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. లీకేజీలపై సిబిఐ ఈడి విచారణ జరపాలని, ఇందులో వేల కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. కమీషన్ బోర్డు, చైర్మెన్ సభ్యులను తొలగించాలని, తొలగించకుండా పరీక్షలు నిర్శహించవద్దన్నారు. అలా చేయలేని పక్షంలో కమీషన్ ఆఫీసు, ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరు చెప్పి, తెలంగాణ వచ్చాక లిఫ్ట్, లిక్కర్, లీకేజీ స్కాంలు చేశారని మండిపడ్డారు. రాజ్యసభ ఎం.పి రాంజీ గౌతమ్ మాట్లాడుతూ… గ్రామగ్రామన బిఎస్పి పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో గెలవడానికి సిద్దపడుతుంది. తెలంగాణలో రైతులు విద్యార్థులు నిరుద్యోగులు సంతోషంగా లేరని తెలిపారు. లీకేజీలతో నిరుద్యోగులు ఆవేదనలో ఉన్నారన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. ధనికులు ఇంకా ధనికులుగా మారుతుంటే.. పేదలు ఇంకా పేదరికంలోనే ఉన్నారన్నారు. బిఎస్పి పాలనలోనే విద్యార్థులు, రైతులు, మహిళలకు తెలంగాణలో న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్, గొల్ల సతీష్, మైనారిటీ కన్వీనర్ అబ్రార్ హుస్సేన్, జిల్లా అధ్యక్షులు బాలరాజు, జిల్లా మహిళా నాయకురాలు వసంత, నియోజకవర్గ ఇంచార్జి గులాని సాయిలు, ప్రఙ్ఞా కుమార్, అధ్యక్షులు తుకారం, సురేష్ గౌడ్, తదితరులు హాజరయ్యారు.












































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.