నవతరం

తెలుగు దినపత్రిక

శాపంగా మారిన భద్రకాళి చెరువు

గ్రేటర్ వరంగల్, నమస్తే ఎల్లంపల్లి: స్థానిక శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్, ప్రజాప్రతినిధులు gwmc యొక్క నిర్లక్ష్యం పోతన నగర్, భద్రకాళి చెరువు పరిసర కాలనీల పాలిట శాపంగా మారింది. 11డివిజన్ లోని పోతన నగర్ మరియు డివిజన్లో వివిధ కాలనీలో పర్యటించి వరద బాధితుల కోసం మధ్యాహ్న భోజన ఏర్పాటు చేశారు జంగా రాఘవరెడ్డి. ఈ సందర్భంగా డిసిసిబి మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వరద ప్రభావానికి గురైన ఇళ్ల యొక్క బాధితులను కలిశాను వాళ్ళ యొక్క పరిస్థితి అతి దారుణంగా ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కూడా ప్రభుత్వం భద్రకాళి కరకట్ట యొక్క మరమ్మత్తులు చేపట్టలేదు దాని యొక్క ఎత్తును పెంచలేదు, వీళ్ళ నిర్లక్ష్యాన్ని ప్రకృతి వైపరీతంగా చిత్రీకరిస్తూ తప్పించుకుంటున్నారు. గత వరదల సమయంలో కేటీఆర్ ఇచ్చిన హామీని స్థానిక శాసనసభ్యుడు మర్చిపోయి ఇది ప్రకృతి వైపరీత్యమని చిత్రీకరిస్తూ జనం మధ్యలో నటిస్తూ తిరుగుతున్నాడు. వరద ప్రభావానికి గురైన కాలనీలో ఉన్న ప్రజలకు ఇంటికి 25వేల రూపాయలు ప్రభుత్వ అందజేయాలని ఇల్లు ధ్వంసమై ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు ప్రభుత్వం నిర్మించాలని జంగా రాఘవరెడ్డి రెడ్డి ప్రభుత్వాన్ని మరియు స్థానిక శాసన సభ్యుడిని డిమాండ్ చేశారు. వరద ప్రభావానికి గురైన కాలనీలో ప్రజలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రహత్ పర్వీన్ రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి, ఖాజా పాషా గ్రేటర్ వరంగల్ సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ, మొహమ్మద్ జమీరుద్దీన్ డిస్టిక్ మైనారిటీ వైస్ చైర్మన్, వై భాస్కర్, సయ్యద్ అజ్గర్ అలీ గ్రేటర్ వరంగల్ సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, గోవిందు నాగరాజు, కడారి అశోక్, మహమ్మద్ రబ్బానీ భాయ్, కుసుమ, దయానంద్, ఇర్షాద్, పుల్ల వీరమని, యాకూబ్, టింకు, కత్తుల కవిత, సయ్యద్ ఇసాక్, రథం బ్రహ్మం, అనిల్, సాయి, రేమో, బరిగల సునీల్, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading