నవతరం

తెలుగు దినపత్రిక

ఆర్టీసీ విలీనంపై తీర్మానం ప్రవేశపెట్టిన ఎమ్మెల్సీ

* రైతు రుణమాఫీ, ఆర్టీసీ విలీనంపై తీర్మానాలు ప్రవేశపెట్టిన ఎమ్మెల్సీలు

హైదరాబాద్‌, (నమస్తే ఎల్లంపల్లి): రైతు రుణమాఫీ సహా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను అభినందిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు గురువారం శాసనమండలిలో తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రైతు రుణమాఫీ చేయడం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల అభినందిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, శాసనమండలి విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు మరో తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని రైతుల రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని వారన్నారు. రైతులకు రూ. 19వేల కోట్ల రుణాలను మాఫీచేస్తామని ప్రకటించి గురువారం నుంచే రుణాలను మాఫీ చేయడం ప్రారంభించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. టీఎస్‌ ఆర్టీసీ సంస్థను విలీనం చేయడంతో ఆర్టీసీలో పనిచేస్తున్న 43,373 మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారని వెల్లడించారు. సంస్థ పరిరక్షణతో పాటు, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.

– స్పెషల్ రిపోర్ట్, హైదరాబాద్ (లింగం శ్రీకాంత్)

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading