నవతరం

తెలుగు దినపత్రిక

మీ ఇంటి బిడ్డలా మీకు తోడుంటా

  • వివేకానందకు ముందు వివేకానంద తరువాత ఇంటి ముందు అభివృద్ధి చూడండి
  • ప్రజల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాలన, సంక్షేమం చేపట్టే నేత సీఎం కెసిఆర్ అన్నారు కే.పీ. వివేకానంద

కుత్బుల్లాపూర్, అక్టోబర్ 29 (నమస్తే ఎల్లంపల్లి): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 20వ వార్డు పూజిత ఎన్క్లెవ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కే. పీ.వివేకానంద మాట్లాడుతూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 13 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీ, పార్కుల అభివృద్ధితో పాటు అన్ని మౌనిక వసతులను కల్పించామన్నారు. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో గతంలో మీరు చూసిన సమస్యలు నేడు లేవని ఇదే బిఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. మీ ఇంటి బిడ్డలా మీకు తోడుంటా. అభివృద్ధిని బేరీజు వేయాలంటే వివేకానందకు ముందు వివేకానంద తరువాత  చూడండన్నారు. అనంతరం సీనియర్ యాక్టర్ చిట్టి బాబు మాట్లాడుతూ సమస్య ఉందని ఇంటికి వెళ్తే తమ, పర భేదం లేకుండా ఆప్యాయంగా పలకరించి సమస్యను వెంటనే పరిష్కరించే నేత ఎమ్మెల్యే వివేకానంద అని, ఇలాంటి నాయకుడు మళ్ళీ గెలవాలని, మరో మారు కే. పీ. వివేకానంద ను భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తామన్నారు. అనంతరం విస్పర్ వ్యాలీ కాలనీకి చెందిన 100 మంది యువకులు లక్ష్మీపతి రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కెపీ వివేకానంద్ సమీక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహావానించారు. ఈ సమావేశంలో నిజాంపేట్ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ రంగారాయ ప్రసాద్, కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, గాజుల సుజాత,  ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, గంగేయ్యల శ్రీనివాస్ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు జ్యోతి సతీష్, సయ్యద్ సలీం, తలారి వీరేష్ , సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి,ఆవుల జగన్ యాదవ్, బొర్రా చందు ముదిరాజ్, ఆవుల జగదీష్ యాదవ్, చంద్రగిరి సతీష్, కోలన్ కృష్ణ రెడ్డి, మహిళా నాయకులు సబిత జలంధర్ రెడ్డి,ఇతర ముఖ్యులు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ జెనరల్ సెక్రెటరీ నాగరాజ్ యాదవ్,వైస్ ప్రెసిడెంట్స్, అనుబంధ కమిటీల సభ్యులు, స్థానిక డివిజన్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి, మహిళా అధ్యక్షులు సంధ్యారాణి, ఆయా డివిజన్ అధ్యక్షులు, అనుబంధ కమిటీల సభ్యులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు, మైనారిటీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సభ్యులు, స్థానిక డివిజన్ ఆయా కాలనీ అసోసియేషన్ సభ్యులు, అధ్యక్షులు, సంక్షేమ సంఘం సభ్యులు, స్థానికులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగా చారీ, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అభిమానులు, ఇతర ముఖ్యులు,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading