నవతరం

తెలుగు దినపత్రిక

హ్యాట్రిక్ ఖాయం..!

* భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్న ఆనంద్ నగర్ కాలనీ వాసులు
* అభివృద్ధి ప్రధాతకు అండగా నిలుస్తామన్న ఎన్ఎల్బీ నగర్, పద్మశాలి బస్తి వాసులు
* బీఆర్ఎస్ లో చేరిన బిజెపి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు

కుత్బుల్లాపూర్, అక్టోబర్ 29 (నమస్తే ఎల్లంపల్లి): శనివారం నాడు సాయంత్రం సుభాష్ నగర్ డివిజన్ ఆనంద్ నగర్ కాలనీలో సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసిన సమావేశంలో తమ కాలనీలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికై కె.పీ. వివేకానంద్ వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అడిగిన వెంటనే తమ కాలనీ లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధికి సహకరిస్తూ సంక్షేమ పథకాలను కాలనీ వాసులకు అందరికి అందించడానికి కృషి చేస్తునందుకు గాను కాలనీ వాసులు అందరం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ముచ్చటగా మూడవ సారి భారీ మెజారిటీ తో గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపి వివేకానంద్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అదే కాలనీ కి చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు రాజకుమార్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు, వీరికి కేపీ వివేకానంద కండువాలు కాప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బి వెంకటయ్య, జి పవన్, మహిపాల్ గౌడ్, సి ఎహ్ విజయ్ కుమార్, ఏ. రవి కుమార్, ఎస్ నారాయణ రావు, బి మొగులయ్య, ఎస్ రమేష్, ఎస్ నర్సిములు గౌడ్, వీ రమేష్, డి మల్లేష్ యాదవ్, జె శ్రీనివాస్ గౌడ్, ఏ సాయి కుమార్, కే మహిపాల్, ఏ రవి కుమార్, సి ఎహ్ సాయి, శ్రవణ్ కుమార్, ఎస్ భాస్కర్ తదితరులు కాలనీ బస్తి వాసులు సంక్షేమ సంఘం సభ్యులు, మాజీ కార్పొరేటర్ జి.సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కోఆపరేటవే చైర్మన్ మన్నే రాజు, మాజీ కౌన్సిలర్ బోబ్బా రంగారావు, సీనియర్ నాయకులు వెంకట స్వామి, శివాజీ, యాదగిరి, బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



చింతల్ డివిజన్ ఎన్ఎల్బీ నగర్, పద్మశాలి బస్తి వాసుల ఏకగ్రీవ తీర్మాణం
చింతల్ డివిజన్ పరిధిలోని ఎన్ ఎల్ బీ నగర్ మరియు పద్మశాలి బస్తి లో కాలనీవాసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యలపై చురుగ్గా స్పందించే నాయకుడు కె.పీ. వివేకానంద్ లాంటి వ్యక్తి అధికారంలో ఉంటేనే సుపరిపాలన, సంక్షేమం సాధ్యమని నమ్ముతున్నామని వారి అడుగుజాడల్లో నడుస్తూ కాలనీ అభివృద్ధికి తోడుంటామని నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో వివేకానంద్ కే తమ సంపూర్ణ మద్దతు అని, వారిని ముచ్చటగా మూడవ సారి లక్ష మెజారిటీతో గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎల్బీ నగర్, పద్మశాలి బస్తి వెల్ఫేర్ అసోసియేషన్ నుండి కే.పీ.వెంకటేష్, ఎం. బస్వరాజ్, ఏ.ప్రభాకర్, రాజా బ్రహ్మం, నర్సయ్య, రాములు గౌడ్, బాలస్వామి, స్వర్ణ లతా, ప్రకాష్, విజయ లక్ష్మి, స్వప్న, చంద్రశేఖర్, గౌతమ్, సంపత్ గౌడ్, ఆర్.కుమార్, కె.ఉమా శంకర్, జి.సాయిబాబ, ఎస్. ప్రకాష్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మహమ్మద్ రఫీ, మఖ్సూద్, కర్నేకంటి మల్లేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading