నవతరం

తెలుగు దినపత్రిక

నీటి ఎద్దడిని పరిష్కరించండి

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కు వినతి పత్రం అందజేత

కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దుందిగల్ మున్సిపాలిటీ “డి.పోచంపల్లి డబుల్ బెడ్ రూమ్” ఇళ్ల లబ్ధిదారులు కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని కలిసి మంచి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో గల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద మౌలిక వసతుల కల్పనను కృషిచేస్తానన్నారు. అనంతరం ఎమ్మెల్యే అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ పొందిన లబ్ధిదారులు కొందరు ఇప్పటికే వారి కేటాయించిన ఫ్లాట్లలో నివసిస్తున్నారని వారికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు నవీన్, ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్, ఉపాధ్యక్షులు భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading