నవతరం

తెలుగు దినపత్రిక

కంగ్రాట్స్ వీరేష్ ముదిరాజ్

* మేడ్చల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కాసాని వీరేష్ ముదిరాజ్

కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 27: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం ఉదయం 11 గంటలకు బాచుపల్లి లో గల అసోసియేషన్ ఆఫీసు నందు నిర్వహించడం జరిగింది. ఇందులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని 15 మండలాలకు సంబంధించినటువంటి కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఓటింగులో పోల్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులుగా కాసాని వీరేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా చంద్రహాస్, ఉపాధ్యక్షుడిగా తిరుమల్ రెడ్డి, ట్రెజరర్ గా జీవి సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రెటరీగా ఎన్ రమాదేవి, ఈసీ మెంబర్స్ గా జహంగీర్ మరియు కృష్ణవినీల గెలుపొందారు. ఈ ఎన్నికలు తెలంగాణ కబడ్డీ సంగం నిబంధనలకు లోబడి నిర్వహించడం జరిగిందని అబ్జర్వర్స్ గా వచ్చినటువంటి స్టేట్ జాయింట్ సెక్రటరీ నర్సింగరావు, డి వై ఎస్ ఓ ఎన్ సుధాకర్ రావు, సీఐ మహేందర్ రెడ్డి మరియు రిటర్నింగ్ ఆఫీసర్స్ గా హైకోర్టు అడ్వకేట్స్ శ్రీనివాస్, దేవేందర్ లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మరియు ప్రధాన కార్యదర్శి జగదీష్ యాదవ్ పాల్గొని నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading