కొండా సురేఖ అక్కకు జరిగిన అవమానం తెలంగాణ మహిళా లోకానికి జరిగిన అవమానం అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జంగా రాఘవరెడ్డి మండిపడ్డారు. సోషల్ మీడియాలో అసబ్య పోస్టులను ప్రొత్సహిస్తున్న బీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ది చెబుతారు జాగ్రత్త.. కొండా సురేఖ ఎవరో తెలిసే ఇటువంటి బద్మాష్ చేస్టలకు పాల్పడుతున్నారా..? హరీశ్ రావు, కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఇ ఇటువంటి బద్మాష్ లను జైలుకు పంపించే వరకు తమ్ముడిగా అండగా ఉంటానన్నారు జంగా రాఘవరెడ్డి.
హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మీద సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌పై తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తీవ్రంగా స్పందించారు. సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలే అన్నారు. సురేఖను ట్రోలింగ్ చేసిన వివరాలను కాంగ్రెస్ కార్యకర్తలు సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా స్టేషనల్లో కేసులు పెట్టనున్నమని జంగా రాఘవరెడ్డి తెలిపారు. అక్కకు జరిగిన అవమానం మంత్రిగా ఉన్న మహిళా అన్న భయం కూడా బి.ఆర్.ఎస్ నేతలకు లేదన్నారు. కాం్రెస్ కుటుంబ సభ్యులు ఇటువంటి వాటిని చూస్తూ ఊరుకోరన్నారు. ఇలాంటి దమాక్ లేని చేస్టలకు పాల్పడుతున్న వారిని జైలుకు పంపించే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు గానీ తాను గానీ ఊరోకోమని హెచ్చరించారు. అక్కకు మద్దతుగా రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు ఉన్నారన్న సంగతి మరవద్దన్నారు. బిఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఈ అంశంపై స్పందించి సోషల్ మీడియాను కంట్రోల్ చేసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకున్న వారే ఇలాంటి ట్రోలింగ్ చేశారని మండిపడ్డారు. కొండా సురేఖపై ట్రోలింగ్ జరగడంపై హరీశ్ రావు ఒక ట్వీట్ పెట్టి వదిలేయడం కాదని, క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మీ పార్టీ సోషల్ మీడియా కోసం చాలామందిని నియమించుకొని తప్పుడు పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి తప్పుడు రాతలు, వెకిలి చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యంగా మహిళా నాయకులను కించపరిచే ప్రయత్నం చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించవలసి వస్తుందని కేటీఆర్‌ను జంగా రాఘవ రెడ్డి హెచ్చరించారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.