నవతరం

తెలుగు దినపత్రిక

ఎమ్మెల్యే నివాసంలో ముఖ్య కార్య‌క‌ర్త‌ల స‌మావేశం

రాజేంద్రనగర్: ఏఐసీసీ అధ్య‌క్షులు మ‌ల్లీకార్జున ఖ‌ర్గే బ‌హిరంగ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం శాస‌న‌స‌భ్యులు ప్ర‌కాష్ గౌడ్ అన్నారు. గురువారం రాజేంద్ర‌న‌గ‌ర్ స‌ర్కిల్ ప‌రిధిలోని ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్ నివాసంలో ముఖ్య కార్య‌క‌ర్త‌ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్ హాజ‌రై ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు. ప్ర‌ధానంగా శుక్ర‌వారం ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించబోయే బ‌హిరంగ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్య‌క్షులు మ‌ల్లీకార్జున ఖ‌ర్గే హాజ‌రు కానున్న‌ట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading