- కూకట్పల్లి ఎమ్మెల్యేకృష్ణా రావు కు బహిరంగ సవాలు విసిరిన పీఏసీ చైర్మన్ అరేకపూడి గాంధీ
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం లోని సర్వే నంబర్ 307 లో వున్న 11 ఎకరాలు భూమి పై ఎటువంటి చర్చకైనా, విచారణ కైనా నేను సిద్ధమనీ పీఏసీ చైర్మన్ గాంధీ అన్నారు. 2009 నుంచి, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నాటి నుండి ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జి కానీ, ఈడీ విచారణకైనా నేను సిద్ధం… కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణ రావు నువ్వు సిద్దమా, నిజాయితీగా నిలబడండి, లేదంటే పర్యవసానాలు ఎదుర్కోండి అని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలను, ప్రభుత్వ భూముల పరిరక్షణను స్వాగతిస్తున్నానని, అయితే ప్రైవేటు భూములపై దాడులు చేయడం సరికాదని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో బీఆర్‌ఎస్ శాసనసభ్యులు, మాజీ స్పీకర్ తదితరులు తన భూముల వ్యవహారంపై చేసిన ఆరోపణలపై తీవ్రస్థాయిలో స్పందించారు. 11 ఎకరాల కొనుగోలుపై వివరణ ఇస్తూ మేము తొమ్మిది మంది కలిసి కొన్నామన్నారు. తన భూముల కొనుగోలుపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే గాంధీ స్పష్టత ఇచ్చారు. 11 ఎకరాల కొనుగోలు వాస్తవమే, కానీ మేమంతా కలిసి కొన్నామని ఆయన ప్రకటించారు. 1991లో కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన పహానీ, రిజిస్ట్రేషన్ పత్రాలు, పవర్ డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక ఎటువంటి భూములను కొనలేదని స్పష్టం చేశారు. కొందరు అమాయకులను తప్పుదారి పట్టించి, పది ఎకరాలు, 11 ఎకరాలు అని పదేపదే చెప్పడం ఓర్వలేక కేటీఆర్‌తో చెప్పించడం జరిగింది, అది తప్పు. కుటుంబ సభ్యులు, మాజీ కార్పొరేటర్ శోభనాద్రి, నిజామాబాద్ సభ్యులు సహా తొమ్మిది మంది కలిసి అరెకరం, అరెకరం చొప్పున ఆ భూమిని కొనుగోలు చేశామన్నారు. 2008లో ఎస్ఎఫ్సీ భూములకు తమకు సంబంధం లేదని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని, రెవెన్యూ అధికారులు కూడా తమ భూమి ప్రైవేటు అని కోర్టుకు సమర్పించారని గాంధీ గుర్తు చేశారు.
ప్రత్యర్థులపై తీవ్ర ధ్వజం: దమ్ముంటే చర్చకు రండి
తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఒకరు 3 ఎకరాలు, మరొకరు 11, ఇంకొకరు 300 ఎకరాలు అని ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే మీడియా సమక్షంలో బహిరంగంగా చర్చకు రండి. నా వద్ద ఉన్న డాక్యుమెంట్లను ప్రదర్శిస్తాను అని ఆయన సవాల్ విసిరారు. తనపై బురద జల్లడం సమంజసం కాదన్నారు. కోర్టులో తన పత్రాలను ప్రదర్శించినప్పుడు, ప్రతివాదులు ‘నాట్ టు ఇంటర్‌ఫియర్’ ఆర్డర్‌తో పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారని తెలిపారు. మీ కోట్లు ఎలా వచ్చాయి అని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్యే గాంధీ, తనపై ఆరోపణలు చేసిన వ్యక్తిని ఉద్దేశిస్తూ తీవ్రమైన ప్రశ్నలు సంధించారు. జగద్గిరిగుట్ట నుంచి స్లిప్పర్స్‌తో నడిచేవాడిని, అడవి దొంగ మాదిరిగా వీరప్పన్ మాదిరిగా ఉన్నవాడివి.. ఈరోజు వేయి కోట్లకు పైగా ఎలా ఎదిగావు? ఐడీపీఎల్ భూములను కబ్జా చేసి, 166/6 సర్వే నెంబర్‌లో ఎకరం ఎక్కువ కలిపి స్కూలు కట్టి, 30 లక్షల పన్ను బకాయిలు ఎగ్గొట్టి కేవలం 7 లక్షలే కడుతున్నావు కదా? అని నిలదీశారు. ప్రభుత్వానికి 10 ఎకరాల ఎన్‌ఓసీ ఇస్తే, 11 ఎకరాలలో నిర్మాణం ఎలా చేశారని ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ ప్రభుత్వానికి సరెండర్ చేద్దాం. మీకు దమ్ముంటే నా ఛాలెంజ్ స్వీకరించండని సవాల్ విసిరారు. 2014 నుంచి 2024 వరకు ఏ ఎమ్మెల్యే ఎంత అక్రమంగా సంపాదించారో సీబీఐ, ఈడీ, హోం మంత్రిత్వ శాఖలకు అందజేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
కబ్జాలపై స్పష్టత:
పేదలకు న్యాయం కోరుతూనే… హైడ్రా సంస్థ చేస్తున్న మంచి కార్యక్రమాలను అభినందించినప్పటికీ, పేదల పొట్ట కొట్టడాన్ని తాను ఖండిస్తున్నానని గాంధీ అన్నారు. ఆ పేద ప్రజలకు భూములు ఎవరు అమ్మారు. అమ్మిన వారిని కఠినంగా శిక్షించాలని, పేద ప్రజలను ఎవరు మోసం చేశారో నిజాయితీగా ఆలోచించాలని కోరారు. తాను పదేళ్లపాటు కేసీఆర్, కేటీఆర్ వద్ద ఏ చిన్న పైరవీ చేయించుకోలేదని తెలిపారు. కూకట్‌పల్లి సర్వే నెంబర్ 90, ఐడీపీఎల్ భూములు, బోరంపేట, బాచుపల్లి ప్రాంతాల్లోని కబ్జాలపై త్వరలో ప్రెస్ క్లబ్ లో ఆధారాలతో సహా బట్టబయలు చేస్తానని హెచ్చరించారు. తాను ఎక్కడైనా పొరపాటున భూమిని కబ్జా చేసి ఉంటే, దాన్ని కూడా ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని పీఏసీ చైర్మన్ గాంధీ పేర్కొన్నారు. సర్వే నంబర్ 307 లో నాకు, మరి కొంతమంది కి చెందిన ప్రయివేటు భూముల్లో రేకుల పై రాళ్ళతో కొట్టడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. నేను స్వచ్ఛతగా ఉన్న, నేను రాజాకియాల్లోకి వచ్చాక భూమిని కొనుగోలు చేయలేదు. 1991లో పట్టా భూమిని కొనుగోలు చేసినట్టుగా క్లారిటీగా ఉంది. నా కుటుంబ సభ్యులు 9 మంది కలిసి కొన్న భూమి అది, దీనిపై ఏ విచారణకు అయినా సిద్ధం. 2008 లో తమ భూమి ఎస్ఎఫ్సీ భూముల్లో ఉంది అని ఆరోపణలు వచ్చాయి.. అయితే హైకోర్టు లో ఎస్ఎఫ్సీ కి ఈ భూమితో సంబంధము లేదని స్పష్టంగా తేల్చి చెప్పింది. ఎమ్మెల్యే కృష్ణా రావు చేసిన ఆరోపణాల్లో వాస్తవం లేదు. ఈ రోజు బీఆర్ఎస్ నుండి తమ భూమి దగ్గరకు వచ్చిన వారు నాకు ఫోన్ చేసి అడిగితె నేనే వెళ్లి అన్నీ వివరాలు ఇచ్చేవాడిని, 1991 లో పైసల పట్టి, నక్ష, భూమి లొకేషన్ మ్యాప్ లతో సహా అన్ని ఉన్నాయి అన్నారు. ఇలా ఆరోపణలు చేయడం వల్ల లాభం ఏంటో… దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ చర్చకు రండి నేను సిద్ధం.. అన్నారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. మిస్సింగ్ సర్వే నెంబర్ కింద హక్కుదారులు అందరూ కలిసి అప్లికేషన్ పెట్టుకుంటే ధరణి లో చేర్చడం జరిగింది. ఒక వ్యాపార వేత్తగా నేను 1991 లో కొన్న ల్యాండ్ ను హోల్డ్ చేసుకోవడం లో తప్పు ఏంటి, ఎమ్మెల్యే అఫిడవిట్ లో కూడా చూపించాను అని మండిపడ్డారు. పిచ్చి ఆరోపణలు కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ కు చెందిన మిగతా శాసన సభ్యులను కూడా కృష్ణా రావు మిస్ గైడ్ చేస్తున్నారు. కూకట్పల్లి స్మగ్లర్ వీరప్పన్ వి నువ్వు, నీ చరిత్ర ఏంటి.. నా చరిత్ర ఏంటి అనేది ప్రజలు చూసారన్నారు ఆయన. రాజకీయ పరంగా పార్టీల పరంగా విమర్శలు చేస్తే సాహిస్తాను కానీ అక్రమాలు చేసాను అనే ఆరోపణలు చేసినవారు నిరూపించాలి. లేదంటే వారికి ప్రజాకోర్టులో శిక్ష ఖాయం. కూకట్పల్లి వీరప్పన్ ఎమ్మెల్యే కృష్ణా రావు అక్రమాలు అన్నీ బ్రేకింగ్ న్యూస్ లాగా బయటపెడతానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.