* డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలలో పార్క్, దేవాలయాభివృద్ధికి కృషిచేస్తానన్న బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్
కుత్బుల్లాపూర్: దుండిగల్ మున్సిపాలిటీ పరిధి డి.పోచంపల్లి డబుల్ బెడ్ రూమ్ 11వ బ్లాక్ ఇళ్ల సముదాయాల వాసులు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలలోని ఖాళీ స్థలంలో పార్కు నిర్మాణంతో పాటు దేవాలయాన్ని నిర్మింపచేయాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ… నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తూ బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే కుత్బుల్లాపూర్ లోని అనేక డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలలో మౌలిక వసతులను కల్పించామన్నారు. రానున్న రోజుల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు పార్కు నిర్మాణంతోపాటు, దేవాలయాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ 11వ బ్లాక్ అధ్యక్షులు వినోద్ నాయక్, కమిటీ సభ్యులు రాజు, చాంద్, గౌస్, గజేంద్ర, జావిద్, మిథున్, దీపిక, సునీత తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.