నవతరం

తెలుగు దినపత్రిక

కవిత.. దూకుడు

మెదక్ / హైదరాబాద్: జాగృతి జనంబాట చేపట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు ప్రజల నుండి మంచి స్పందన కనిపిస్తోంది. కవితక్క కార్యక్రమంపై మొదట్లో చాలా మంది నేతలు పెదవి విరిచారు. గతంలో వైఎస్ షర్మిల యాత్రతో పోల్చుకున్నారు. కానీ సీన్ లో అలాంటి భ్రమలను, అంచనాలను కవిత పటాపంచలు చేస్తున్నారు. తనపై లిక్కర్ కేసు నమోదు కాగానే డాటర్ ఆఫ్ ఫైటర్.. తగ్గేదెలే అని కవితక్క ప్రకటించుకున్నారు. మొదటి నుండీ కవిత నైజం పోరాటమే. పోరాడకుండా ఆమెకు ఏదీ దక్కలేదు. ఇప్పుడు కవితక్కను బయటకు పంపిన తర్వాత.. స్వీయ అస్తిత్వం కోసం ఆమె ప్రారంభించిన జనం బాట రోజులు గడిచిన కొద్దీ స్పందన పెరుగుతున్నది. కవితకు లభిస్తున్న స్పందన, లేవనెత్తు తున్న సమస్యలు, సంధిస్తున్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎంత కీరోల్ పోషిస్తున్నదో అర్థమవుతున్నది. అసలు తెలంగాణ రాజకీయాలు గత నాలుగేళ్ళుగా కవితక్క చుట్టే తిరుగుతున్నాయి. కవితక్క ప్రస్తావన లేకుండా ఏ ఎన్నికల ప్రచారమూ ముగియడం లేదు. కవితక్క లేవనెత్తే ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతల దగ్గర సమాధానం లేదు. కాంగ్రెస్.. బిజెపి నేతలకంటే కవిత సంధించే ప్రశ్నలు గతంలో తప్పులు చేసిన బీఆర్ఎస్ నేతలకు నేరుగా తగులుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో.. కవితక్క పర్యటన సూపర్ హిట్ అయింది. మెదక్ లో దుమ్మురేపింది. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న విధానం, ప్రజలతో కలిసిపోతున్న విధానం.. ప్రశ్నలోని నిజాయితీ ఆమెకు ఆదరణ పెంచుతోంది. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన ఈ పర్యటనలలో భాగంగా, ప్రజలు తమ కష్టా లను తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రైతు సమస్యలు, విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ఆమెగారు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని. ఈ కార్యక్రమాని కి ప్రజలు తరలివస్తున్నారని నివేదించింది.

సంచలనాలేకాదు.. సూచనలు
కవితక్కతో ప్రజలు స్వయంగా మాట్లాడటం, సమస్యలను తెలియజేయడం వంటివి జరుగుతున్నాయి. దీంతో కార్యక్రమాలకు ప్రజలు తరలివస్తున్నారు. ప్రజలు కవితను కలిసేందుకు, సమస్యలు చెప్పేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. రైతులు, యువత, మహిళలు ఈ వర్గాల కష్టాలను ఆమె తెలుసుకుంటూ కొన్నింటిపై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడుతున్నారు. కవిత బృందం కూడా పర్యటనలో భాగంగా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తోంది. కవిత ప్రస్తావించిన పలు సమస్యలను అధికారయంత్రాంగం అక్కడికక్కడే పరిష్కరిస్తోంది. మెదక్ లో రింగురోడ్డు రింగులపై కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. హరీష్ రావు, నవీన్ రావు, గంగుల కమలాకర్ భూములపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ కాక పుట్టించాయి. దీనిపై ఎమ్మెల్సీ నవీన్ కుమార్ స్పందించారు. అనేకమంది నేతలు కవితపై ఎటాక్ చేసినా చలించలేదు. దమ్ముంటే హరీష్ రావును కౌంటర్ ఇవ్వమని సవాల్ చేశారు. తొణకని బెణకని కవిత సాహసం చూసి నేతలు ముగ్ధులవుతున్నారు. సోషల్ మీడియాలో కాదు గ్రౌండ్ ను పట్టించుకుంటే జూబ్లిహిల్స్ లో రిజల్ట్ ఉంటుండే అంటూ కవిత వేసిన కౌంటర్ ను బీఆర్ఎస్ శ్రేణులు కూడా నిజమేనని వైరల్ చేశాయి. దాంతో సోషల్ గ్రౌండ్ ను వదిలి పత్తిమార్కెట్ ను కేటీఆర్, హరీష్ రావులు జిల్లాల్లో సందర్శించారు. యాక్షన్.. రియాక్షన్ అంటూ కవితక్క టీమ్ స్పందించింది. ఇక మహేశ్వరం నియోజకవర్గంలో కవిత పర్యటనలో కబ్జాల అంశాన్ని ప్రస్తావించి నేరుగా ఎటాక్ చేయడంతో పెద్ద సంచలనమైంది. సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేసుకుని డాక్యుమెంట్లతో దండయాత్ర చేసిన తీరు కవితక్కకు అనేకమంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఇపుడు పాలమూరు జిల్లాలో కవితక్క పర్యటిస్తోంది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, వివిధ ప్రాధాన్యరంగాలను ఫోకస్ చేసుకుని కవితక్క జిల్లాలు చుట్టేస్తోంది.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading