నవతరం

తెలుగు దినపత్రిక

గెలిపించండి… అభివృద్ధి చేసిచూపిస్తా!

  • జోరుగా భోజ్జ్య తండా సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం.
  • లావుడియా ద్వాళి ప్రచారానికి గ్రామస్తుల బ్రహ్మరథం.
  • ప్రచారంలో దూసుకుపోతున్న యువ నాయకుడు లావుడియా మహేందర్.

భద్రాద్రి కొత్తగూడెం, నవతరం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు మండలం, భోజ్జ్య తండా పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీకి తలపడుతున్న అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లావుడియా ద్వాళి ఆదివారం రాజారావుపేట, భోజ్జ్య తండా, ఫుల్లుడు తండా గ్రామాల అన్ని వార్డులలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రచారం ప్రారంభించిన మొదటి రోజు నుండి గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ గ్రామంలోని ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను గుర్తిస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రచారానికి ప్రముఖ పార్టీల కార్యకర్తలు, నాయకులు లావుడియా ద్వాళి తో ర్యాలీలో పాల్గొని గ్రామస్తుల ఓట్లను అభ్యర్థిస్తున్నారు.ఈ ప్రచారానికి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. ప్రచారంలో భాగంగా ద్వాళి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలను గడపగడపకు అందిస్తామని, బొజ్జ తాండ గ్రామాన్ని అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని నాకు ఒక్క అవకాశం ఇచ్చి సర్పంచ్ గా గెలిపించాలని అన్నారు. భోజ్జ్య తండా పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయితీగా తీర్చిదిద్దుతానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి గడపగడపకు చేరేలా నా వంతు పూర్తి బాధ్యతగా అందిస్తామన్నారు. 17న జరిగే ఎన్నికల్లో బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పలు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading