నవతరం

తెలుగు దినపత్రిక

రాజ్పల్లి పోలింగ్ బూత్ ను పరిశీలించిన మెదక్ ఎస్పీ

మెదక్, నవతరం: సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌గా గుర్తించబడిన రాజ్‌పల్లి పోలింగ్ బూత్‌ను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు అందిస్తూ, పోలింగ్ కేంద్రంలో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరించాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీ సమయంలో ఎస్పీ వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఆర్‌ఐ శైలందర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సందీప్ రెడ్డి, ఎసైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading