నవతరం

తెలుగు దినపత్రిక

మణుగూరు లో పర్యటించిన కవిత

భద్రాద్రి కొత్తగూడెం, నవతరం: జాగృతి జనంబాటలో భాగంగా మణుగూరు కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో నిర్వాసితులైన గొత్తికోయల గూడాన్ని సందర్శించారు తెలంగాణ జాగృతి చీఫ్ కవిత. ఈ సందర్బంగా ఆవిడ మాట్లాడుతూ… ఓపెన్ కాస్ట్ విస్తరణ పేరుతో 72 గోత్తికోయల కుటుంబాలను రోడ్డున పడేయడం అమానుషమన్నారు. గూడానికి కనీసం రోడ్డు, కరెంట్, తాగునీటి సౌకర్యం, స్కూల్ కూడా లేకపోవడంతో అడవి బిడ్డలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్వాసితులకు సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకొని ఆర్‌అండ్ఆర్ ప్యాకేజీని వెంటనే ఇవ్వాలి. 72 కుటుంబాలకు ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేస్తున్నాం, గొత్తికోయల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తెలంగాణ జాగృతి పోరాడుతుందన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading