కూకట్పల్లి / శేరిలింగంపల్లి, నవతరం: కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరాం కృష్ణారావు ను బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన నాయకుడు పోట్టా నరేందర్ యాదవ్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరికపై విస్తృతంగా చర్చించారు. రవి యాదవ్ నాయకత్వంలో జరుగుతున్న పార్టీ బలోపేత కార్యక్రమాలు, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధాంతాలపై ఆకర్షితులై పలువురు నాయకులు పార్టీలో చేరుతున్న విషయాలపై చర్చ జరిగింది. రవి యాదవ్ అధ్వర్యంలో ముందుకు సాగాలని మాధవరం కృష్ణారావుకు సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలకంగా స్పందిస్తూ… “శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేయాలనుకునే వారు ఎవరైనా ముందుగా మారబోయిన రవి యాదవ్ ను కలిసి మాట్లాడిన తరువాతే కార్యకలాపాలు ప్రారంభించాలి. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు” అని స్పష్టంగా తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఐక్యంగా పనిచేయాలని, రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని ఈ సమావేశంలో స్పష్టమైంది.











































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.