నవతరం

తెలుగు దినపత్రిక

సోలాపూర్ లో మెరిసిన తెలంగాణ తేజం

* సోలాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలలో గెలిచిన తెలంగాణ బిడ్డ గుర్రం సత్యనారాయణ రామస్వామి

సోలాపూర్ / హైద్రాబాద్, నవతరం: మహారాష్ట్ర లోని  సోలాపూర్ లో నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన పద్మశాలి బిడ్డ బిజెపి అభ్యర్థిగా  కార్పొరేటర్ గా గెలిచి అందరిని ఆశ్చర్యపరిచాడు. పల్లెర్ల గ్రామానికి చెందిన గుర్రం రామయ్య కుమారుడు  సత్యనారాయణ వ్యాపార రీత్యా మహారాష్ట్ర రాష్ట్రంలోనూ సోలాపూర్ లో నివసిస్తున్నాడు. ఇటీవల జరిగిన సోలాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా 13 వ వార్డు కార్పొరేటర్ గా పోటీ చేశాడు. ఎన్నికలలో గుర్రం సత్యనారాయణ విజయం సాధించారు. పద్మశాలి కుటుంబానికి చెందిన ఈయన కుటుంబం మొత్తం వ్యాపారం నిమిత్తం షోలాపూర్ లో నివసిస్తూ ఉన్నారు. నిత్యం స్థానిక ప్రజలతో సఖ్యత తో ఉంటూ ఉండడం ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ ఉండడం ఇతని గెలుపు కు పునాది అయింది. స్వతహాగా దైవభక్తి ఉండడం సనాతన ధర్మంపై నిత్యం అనేక కార్యక్రమాలు నిర్వహించడం కూడా ఇది గెలుపుకు పునాదిగా మారింది. సోలాపూర్ నగరపాలిక ఎన్నికలలో ఇతనిని గుర్తించిన భారతీయ జనతా పార్టీ నాయకత్వం స్థానిక 13 వ వార్డు అభ్యర్థిగా రంగంలో దింపింది. దాంతో ప్రజాసేవ పై స్పందించే సత్యనారాయణ ను ప్రజలు గెలిపించారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading