హైదరాబాద్ / ఖమ్మం, నవతరం: ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) శత వసంతాల వేడుకలో పాల్గొనడం ఒక అరుదైన సందర్భం అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ… చరిత్రలో కాంగ్రెస్ – కమ్యూనిస్టుల మైత్రి సంచలనాత్మక రాజకీయ ఫలితాలనే కాదు… దేశ ప్రజల పక్షాన చరిత్రాత్మక విధాన నిర్ణయాలు తీసుకోవడంలోనూ కలిసి పని చేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్లీ ఐక్యంగా పోరాడి కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించి… రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ మాటలు విన్న నెటిజెన్లు ‘కాంగ్రెస్ అంటే కమ్యూనిస్ట్… కమ్యూనిస్ట్ అంటే కాంగ్రెస్’ అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. గంతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘ముస్లిం అంటే కాంగ్రెస్… కాంగ్రెస్ అంటే ముస్లిం’ అన్న మాటలు గుర్తు చేసుకున్నారు కాబోలు.
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.