నవతరం

తెలుగు దినపత్రిక

కౌన్సిలరా..? కరుడుగట్టిన గుండానా..?

– అక్రమాలను ప్రశ్నిస్తే అరాచకమా? విలేఖరిపై కౌన్సిలర్ ‘బండ’ బూతుల పర్వం

– అక్రమ గ్రావెల్ దందాను అడ్డగిస్తే అంతు చూస్తారా? ఫోన్ చేసి మరి చంపేస్తానని బెదిరింపులు

– వినాయకపురం గ్రావెల్ మాఫియా గుండెల్లో నవతరం వణుకు

– నిజం రాస్తే నిప్పులు చెరుగుతూ ప్రసాద్ బూతులు తిట్టడం సంస్కారమా?

– అక్రమ సంపాదనకు అడ్డుపడితే కొట్టి చంపుతారా?

– అశ్వారావుపేటలో పత్రికా స్వేచ్ఛపై పడగ విప్పిన అధికార గర్వం

– వార్త ప్రచురిస్తే నా కొడకల్లారా అంటూ నోరు పారేసుకున్న కౌన్సిలర్

– అక్రమ రవాణా పై విచారణ జరపాల్సింది పోయి విలేకరిపై బెదిరింపులా?

– ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది

ఖమ్మం భద్రాద్రి, నవతరం ప్రతినిధి: అక్రమ సంపాదనకు అడ్డువస్తే చాలు.. ప్రజా ప్రతినిధులు కాస్తా ‘గూండాలు’గా మారుతున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన కౌన్సిలర్, అక్రమ రవాణాను ప్రశ్నించినందుకు ఒక పత్రికా విలేఖరిపై నోరు పారేసుకోవడమే కాకుండా, ప్రాణహాని తలపెడతానని బెదిరించడం ఇప్పుడు నియోజకవర్గంలో సంచలనంగా మారింది. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజాధనాన్ని కాపాడాల్సిన కౌన్సిలర్ అక్రమ రవాణాలను ప్రశ్నిస్తే అంతు చూస్తా అనడం ఆయన అహంకారానికి నిదర్శనం. ఇది ఎవడబ్బ సొమ్మని దోచుకుంటారు.ఇది ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజా సొమ్ము.ఒక ప్రజా ప్రతినిధి ప్రజలకు జీతగాడు అన్న సంగతి మరిచి ఫోర్త్ ఎస్టేట్ రంగాన్ని సైతం బండ బూతులు తిట్టడం అమానుషం.

అసలేం జరిగింది?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వినాయకపురం నుండి భారీ ఎత్తున అక్రమ గ్రావెల్ రవాణా సాగుతోంది. ప్రకృతి సంపదను కొల్లగొడుతూ, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ దందాను సాక్ష్యాధారాలతో సహా ‘నవతరం’ పత్రిక వెలుగులోకి తెచ్చింది. వాస్తవాలను ప్రచురించి, ప్రజాధనాన్ని కాపాడాలన్న పత్రికా ధర్మాన్ని నిర్వర్తించినందుకు అశ్వారావుపేట మున్సిపాలిటీ మొదటి వార్డు కౌన్సిలర్ డేరంగుల ప్రసాద్ వీరంగం సృష్టించారు.

ఫోన్ చేసి మరీ కొట్టి చంపేస్తానని బెదిరింపులు!

వార్త ప్రచురితమైన వెంటనే కౌన్సిలర్ డేరంగుల ప్రసాద్ సదరు విలేఖరికి ఫోన్ చేసి, సభ్యసమాజం తలదించుకునేలా బండ బూతులు తిట్టారు. “నా కొడకల్లారా.. వార్తలు రాస్తారా? మీ అంతు తేలుస్తా.. ఎక్కడైనా కనిపిస్తే కొట్టి చంపుతా” అంటూ బహిరంగంగానే ప్రాణహాని తలపెడతానని హెచ్చరించారు. పదవిని అడ్డం పెట్టుకుని వినాయకపురం గ్రావెల్ సంపాదన కొల్లగొడుతున్న వైనం వెలుగులోకి వస్తే ఆ తప్పును సరిదిద్దుకోకుండా విలేకరిని చంపుతానని బెదిరించడం పెరికిపంద చర్య. ఒక వార్డు కౌన్సిలర్ స్థాయి వ్యక్తి, ఫోన్ చేసి మరీ విలేఖరిని బెదిరించడం ఆయన వెనుక ఉన్న అక్రమ దందాల బలాన్ని, అహంకారాన్ని సూచిస్తోంది. ప్రజాస్వామ్యం ఎటు పోతోంది? ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన పత్రికా రంగాన్ని నోరు నొక్కేయాలని చూడటం మరింత పిరికిపంద చర్య. అక్రమాలు నిజం కాకపోతే సంజాయిషీ ఇచ్చుకోవాలి. గ్రావెల్ రవాణా అక్రమం కాదని నిరూపించుకోవాల్సింది పోయి, భౌతిక దాడులకు దిగుతామని బెదిరించడం అంటే.. లోపల ఏదో పెద్ద కుంభకోణమే ఉందని అర్థమవుతోంది.

పోలీసుల మౌనం ఎందుకు?

ఇంత బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అధికార బలంతో సామాన్యులను, విలేఖరులను భయభ్రాంతులకు గురిచేస్తుంటే చట్టం తన పని తాను చేయదా?

బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు

‘నవతరం’ పత్రిక ఎప్పుడూ ప్రజా పక్షమే. డేరంగుల ప్రసాద్ వంటి వ్యక్తులు తమ పదవిని అడ్డం పెట్టుకుని చేసే అక్రమాలను నిలదీస్తూనే ఉంటాం. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, విలేఖరికి రక్షణ కల్పించడంతో పాటు, వినాయకపురంలో సాగుతున్న అక్రమ గ్రావేల్ రవాణాపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.

ప్రజా సంఘాల ఆగ్రహం

వార్త రాసినందుకు విలేకరిని దూషించడం అంటే మొత్తం పత్రికారంగానే అవమానించడమే. డేరంగుల ప్రసాదు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి.

This slideshow requires JavaScript.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading