నవతరం

తెలుగు దినపత్రిక

(వి.సి.) రిజిస్టార్ ను విధులనుండి తొలగించాలి

తెలుగు విశ్వవిద్యాలయంలో విద్యార్థి మృతికి కారణమైన రిజిస్టర్ ప్రొఫెసర్ కోట్ల హనుమంతరావుపై చర్యలు తీసుకోవాలని డిఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శీను నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి సాయి నగర్ ప్రాంతంలో ఉన్న సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయంలో దళిత గిరిజన బహుజన విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ కోట్ల హనుమంతరావును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. నిన్న ఆత్మహత్య చేసుకున్న బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ మూడవ సంవత్సరం చదువుతున్న పరుశురాం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

బాచుపల్లి / హైదరాబాద్: సురవరం ప్రతాప్ తెలుగు విద్యాలయ రిజిస్టార్ హన్మాంతారావు మరియు వెల్డండా నిత్య నందరావు ఉపాధ్యక్షుల   వేధింపుల కారణంగా సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో BFA చదువుతున్న పరశురాములు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మృతదేహాన్ని కూడా తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం లేకుండా దొంగతనంగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో వైస్ ఛాన్స్లర్ వెల్దండ నిత్యానందరావు మరియు రిజిస్టర్ హనుమంతరావుల అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అక్కడ పరిశోదనా చేస్తున్న పీహెచ్డీ విద్యార్థులు మరియు గెస్టుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తులు వారికి జరిగిన అన్యాయం పై జాతీయ గిరిజన కమిషన్ ను సంప్రదించగ కమిషన్ వీరి అవినీతి అక్రమాలపై విచారణ జరిపి మందలించినది.

వీరి అక్రమాలలో ప్రధానమైనవి
1)రిజిస్టార్ కు దగ్గరబంధువైన గురుకుల పాఠశాలలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న (యు. కే)మానస ను యన్ ఓ సి లేకుండా( పి.హేచ్డి)సిటు ఇచ్చి అక్రమానికి పాల్పడ్డారు.
2) దిల్ తెలుగు చలన చిత్రం హీరో గా, డైరెక్టర్ గా, పనిచేస్తూనే
సెలవులు పెట్టుకోకుండా అదేశమయంలో రిజిస్టార్ ప్రొపెసర్గా విధులకు హాజరవు తున్నట్లుగా రికాడ్లలో వ్రాసుకుంటూ జీతబాత్యలుపొందుతూ ప్రభుత్వఖనకు గండికోట్టారు.
3)విశ్వ విద్యాలయ ఉప కులపతి ఐన నిత్య నందరావు ఆత్రం దత్తయ్య అనే విద్యార్థికి ఎటువంటి (పీహెచ్డీ)అడ్మిషన్ లేకపోయినా ఉన్నట్లుగా రికార్డులను సృష్టించి నిత్య నందరవే గైడ్ గా ఉన్నట్లు పేర్కొంటూ పెలోషిప్ ను పొంది ప్రభుత్వ ఖజానాకు గండికోట్టారు. ఈ విషయం పై హైకోర్టు లో జక్కి శంకర్ అనే విద్యార్థి: W.P.No: కేసు పట్టడం జరిగింది. ఆ సందర్బంలో నిత్యనందరావుపెన్సన్ కూడా నిలిపివేయబడింది కానీ ఈ విశయాలను ప్రభుత్వనికి సమాచారం ఇవ్వకుండా వి.సి. ఉద్యోగం లోచేరి చలామణి అవుతున్నారు.
4) గెస్టుగా విధులు నిర్వహిస్తూన
ఓ బంజారా సామజిక వర్గానికి చెందిన గిరిజన అధ్యాపకున్ని విధులు నిర్వహించుటకు ఉత్తర్వులు ఇవ్వకుండా మానసికంగా మనషికంగా హింసిస్తున్నారు
(5)ఓ గిరిజన మహిళ విశ్వ విద్యాలయం నుండి 5 సంవత్సరాల కాలానికి అనుమతి పొంది (పి యం ఆర్ వై)స్కిమ్ద్వారా బ్యాంకు లో లోను తీసుకోని     విద్యార్థిని విద్యార్థుల ఉద్యోగస్తుల రవాణా సౌకర్యర్థం బస్సు ను విశ్వవిద్యాలయానికి అప్పగించారు
అట్టి బస్సును ఆకరణంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించారు దీనితో ఆ గిరిజన మహిళా ఎంతో మానషికి క్షోభను అనుభవిస్తున్నారు.
(6) యం ఫీల్ పెలోషిఫ్ లు పొందిన అనేకమంది గిరిజన విద్యార్థులను
పీహెచ్డీ సీట్లు ఇవ్వకుండా వారిని మనషికంగా హింసిస్తున్నారు
7)ఇలాంటి అనేక అవినీతి అక్రమాలు చేశిన వి, సి, రిజిస్టార్ లపై తగు చర్యలు తీసుకొని విధులనుండి తొలగించాలని సంఘ నాయకులు విద్యార్థులు ప్రభుత్వన్ని కోరుతున్నారు.

Video: https://youtu.be/6FfLJ0msE-w?si=fsoo4_AAg-goPEoA

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading