నవతరం

తెలుగు దినపత్రిక

సైబరాబాద్ పోలీసుల పనితీరు భేష్

  • డీజీపీ శ్రీ  మహేందర్ రెడ్డి, ఐపీఎస్.,
  • సైబరాబాద్ 13 ఫంక్షనల్ వర్టికల్స్ లో టాప్
  • నేరాల నియంత్ర‌ణ‌, పోలీసు దర్యాప్తు, ఫంక్షనల్ వర్టికల్స్ పై తెలంగాణ రాష్ట్ర  డీజీపీ సమీక్ష సమావేశం

హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆల్ యూనిట్ ఆఫీసర్లతో మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి, ఐపీఎస్ క్రైమ్స్ రివ్యూ అండ్ ఫంక్షనల్ వర్టికల్స్ సమావేశం నిర్వహించారు. 2020, ఆగస్టు నెల నుండి ఈ ఆన్ లైన్ క్రైమ్ రివ్యూ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈరోజు 26వ క్రైమ్ రివ్యూ మీటింగ్ జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఫంక్షనల్ వర్టికల్స్ లో సైబరబాద్ పోలీస్ కమీషనరేట్ టాప్ లో నిలిచిందని డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి. సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ను, సిబ్బందిని అభినందించారు.

సైబరాబాద్ 13 ఫంక్షనల్ వర్టికల్స్

1. Reception

 2. DI-DSI

 3. Station House Officer

 4. Station Writer

 5. Crime Writer

 6. Admin SI

 7. Sector SI

 8. Summons

 9. Community Policing

 10. Trainings

 11. Cyber Crime I

 12. Cyber Crime II

 13. Traffic లలో టాప్ లో నిలిచిందన్నారు.

లాంగ్ పెండెన్సీ కేసులను త్వరితగతిన పరిష్కరించడం, గ్రేవ్ కేసులను తగ్గించడంలో, మహిళలు మరియు చిన్నారులకు సంబంధించిన నేరాలను తగ్గించడం, పోక్సో కేసుల పరిష్కారం, వారెంట్ల జారీ, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ క్రైమ్, కమ్యూనిటీ పోలిసింగ్, ట్రైనింగ్స్ వంటి వాటిల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నంబర్ 1 స్థానంలో ఉందని డీజీపీ గారు జోనల్ డీసీపీ లను, క్రైమ్స్ డీసీపీ లను, ఎస్ హెచ్ ఓ లను అభినందించారు. ఫంక్షనల్ వర్టికల్స్ లో సైబరాబాద్ పనితీరు రాష్ట్రంలోనే ఉత్తమ స్థానానికి చేరుకునే విధంగా కృషిచేసిన ఫంక్షనల్ వర్టికల్స్ అధికారులందరినీ అభినందించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ నుంచి మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ సందీప్, డీసీపీ కవిత, డీసీపీ ఇందిరా, ఏడీసీపీలు, ఏసీపీలు, సి‌ఏ‌ఓ లు గీత, చంద్రకళ, మినిస్టల్ సిబ్బంది, వర్టికల్ సిబ్బంది పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading