జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నమస్తే ఎల్లంపల్లి: ఇసుక లారీలు ప్రజల ప్రాణాలు తీస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారు. ఇసుక లారీలు వారం రోజుల వ్యవధిలోనే పెద్దపల్లి జిల్లాలో ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇసుక లారీల ప్రమాదాలపై జిల్లా ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు అధికారులకు ఎన్నిసార్లు చెప్పించిన పట్టించునే నాధుడే కరువయ్యాడు. ఫలితంగా నిత్యం ఏదో ఒక చోట ఇసుక లారీలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. మహదేవపూర్ కాలేశ్వరం మానేరు నదిలో ఇసుక తవ్వకాలను ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పెద్దపల్లి జిల్లా నుంచి హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్ వంటి ప్రాంతాలకు పెద్దపల్లి జిల్లా నుంచి పెద్ద ఎత్తున నిత్యం ఇసుక రవాణ జరుగుతుంది. వందల సంఖ్యలో లారీల్లో ఇసుక రవాణ జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట ఇసుక లారీలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే పెద్దపల్లి జిల్లాలో ఇసుక లారీలు ఢీకొని ఇద్దరు మృతి చెందడం ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది. ఈనెల 4వ తేదిన సుల్తానాబాద్ పట్టణంలో శ్రీరాంపూర్ చౌరస్తాలో ఇసుక లారీ ఢీకొన్ని ప్రమాదంలో సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ కు చెందిన బుచ్చమ్మ అనే మహిళ మృతి చెందింది. ఈనెల 8వ తేదిన పెద్దపల్లి పట్టణంలో ఇసుక లారీ ఢీకొన్న ప్రమాదంలో పెద్దపల్లి పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ గంట నర్సయ్య అనేక వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే.. రెండు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా నిత్యం ఇసుక లారీలు ప్రమాదాలకు గురై పలువురు గాయపడుతున్నారు.
జిల్లా నుంచి వందల సంఖ్యలో లారీల్లో ఇసుక రవాణ జరుగుతున్న సందర్భంలో అధికారుల పర్యవేక్షణ కోరవడిదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండ లారీలు నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా రవాణ శాఖ, పోలీస్, ఆర్ అండ్ బీ అధికారుల మధ్య సమన్వయం లేని కారణంగానే ప్రమాదాలకు జరుగుతున్నాయని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఇసుక రవాణ ఇస్తున్న లారీలు ఓవర్ లోడ్తో వెళ్లడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.. ఓవర్ లోడ్తో వెళ్లుతున్న లారీలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన రవాణ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవరించడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లారీల్లో సామర్ధ్యం కంటే ఎక్కువ మొత్తంలో ఇసుక రవాణ చేయడం వల్ల జిల్లాలోని రోడ్లు గుంతలు పడుతున్న ఓవర్ లోడ్తో వెళ్లుతున్న లారీపై చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్బీ అధికారులు ఫిర్యాదులు చేసిన సంఘటన ఎక్కవ కనిపించడం లేదు.
ట్రాఫిక్ రూల్స్ పేరుతో ద్విచక్ర వాహనాదారులతో పాటు చిన్న చిన్న వాహనదారులపై తమ ప్రతాపం చూపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఇసుక లారీల అతివేగాన్ని అడ్డుకోలేక పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులతో పెట్రోలింగ్ నిర్వహించే సివిల్ పోలీసులు సైతం ఇసుక లారీల ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్, డ్రంకెన్ డ్రైవ్ల విషయంలో శ్రద్ద చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపై ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి పోలీసులు సూచికలు ఏర్పాటు చేయకపోవడం సైతం ప్రమాదాలకు కారణం అవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో ఇసుక లారీలకు మరింత మంది ప్రాణాలు బలికాకముందే అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ఇసుక లారీలు ప్రమాదాలు గురి కాకుండ ప్రజల ప్రాణాలు తీయకుండ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
మేడారం న్యూస్ ఏజెన్సీ భూపాలపల్లి, సీనియర్ జర్నలిస్టు పర్కాల సమ్మయ్య గౌడ్, 9381114244



































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































