నవతరం

తెలుగు దినపత్రిక

శ్రీమన్నారాయణ మరణం తీరని లోటు

జగద్గిరిగుట్ట / కూకట్ పల్లి, నమస్తే ఎల్లంపల్లి: హెడ్ కానిస్టేబుల్ శ్రీమన్నారాయణ మృతి పోలీస్ వ్యవస్థకే తీరని లోటని, నేటి సమాజంలో ఓ మంచి వ్యక్తిని కోల్పోయామని కూకట్ పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నే శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, వడ్డేపల్లి రాజేశ్వర రావు, హరీష్ రెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం శ్రీమన్నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగదిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీమన్నారాయణ శుక్రవారం ఉదయం ఆకస్మత్తుగా మృతి చెందారు. విషయం తెలుసుకొని రాందేవ్ ఆసుపత్రిలో మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో జన్మించిన శ్రీమన్నారాయణ ఎంతో కాలంగా పోలీస్ వ్యవస్థలో పనిచేస్తూ అధికారుల నుండి మంచి పేరు తెచ్చుకొని ఎన్నో అవార్డులు, రివార్డులు, సాధించుకున్న వ్యక్తి అని, సమాజంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. కూకట్ పల్లి, కెపిహెచ్ బి, చందానగర్, లింగంపల్లి, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, పరిసర ప్రాంతాలలో ఆయన పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు.

హెడ్ కానిస్టేబుల్ శ్రీమన్నారాయణ (ఫైల్ ఫోటో)

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading