నవతరం

తెలుగు దినపత్రిక

కన్విక్షన్ల శాతాన్ని పెంచాలి

– సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్
– బేసిక్ పోలీసింగ్ పై దృష్టి సారించాలి: సీపీ
– 2023 సంవత్సరానికి గాను లక్ష్యాలపై శంషాబాద్ జోన్ పోలీస్ అధికారులకు సీపీ దిశా నిర్దేశం
– నేరాల నియంత్ర‌ణ‌, పోలీసు దర్యాప్తు తీరుతెన్నుల‌పై సైబరాబాద్‌ సీపీ సమీక్షా సమావేశం

సైబరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌ పరిధి లోని శంషాబాద్ జోన్ లోని అన్ని పోలీస్ స్టేషన్‌ల అధికారులతో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., శంషాబాద్ డిసిపి ఆఫీసులో క్రైమ్ సమీక్ష సమావేశం నిర్వహించి, 2023 సంవత్సరానికి గాను ఛేదించే లక్ష్యాలపై దిశా నిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధి లోని శంషాబాద్ జోన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల లో నేరాల సంఖ్యను తగ్గించే విధంగా పోలీస్ సిబ్బంది పని చేయాలన్నారు. ముఖ్యంగా బేసిక్ పోలీసింగ్, సెక్టార్ వైస్ పోలీసింగ్ పై దృష్టి సారించాలన్నారు. అత్యుత్తమ పనితీరును కనబర్చాలన్నారు. సెల్ఫ్ డ్రివెన్ తో మోటివేషన్ తో పనిచేయాలన్నారు. త్వరితగతిన కన్విక్షన్లను ట్రయల్ కు తీసుకురావాలన్నారు.

సెక్టార్ ఎస్సైలు పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో సెక్టార్ ఎస్ఐలది కీలకపాత్ర అన్నారు. సెక్టార్ ఎస్సైలు వారి సెక్టార్లలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. నేరాలను తగ్గించేందుకు సెక్టార్ ఎస్సైలు సరికొత్త స్ట్రాటజీలతో ముందుకు వెళ్లాలన్నారు. సెక్టార్ ఎస్సైలు ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్, సీన్ విజిట్, బైండోవర్, నేరం జరిగిన ప్రాంతం, PITA యాక్ట్ లపై దృష్టి పెట్టాలి.

పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ షీట్స్ ద్వారా ఎప్పటికప్పుడు సెక్టార్ ఎస్సైల పనితీరును అంచనావేయడం జరుగుతుందన్నారు. కోర్టు పని, ఎన్ ఫోర్స్ మెంట్, పాయింట్స్ బుక్, పోలీసింగ్ కి సంబంధించిన వివిధ నైపుణ్యాలు, న్యాయ పరిజ్ఞానం, నేర పరిశోధనలో నాణ్యత, టెక్నికల్ నైపుణ్యాలు తదితర అంశాలను పరిగణంలోకి తీసుకొని సెక్టార్ ఎస్ఐలకు మార్కులు ఇచ్చి వారి పెర్ఫార్మెన్స్ ను పరిశీలిస్తున్నామన్నారు. ముఖ్యంగా పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులపై దృష్టి సారించాలన్నారు. కోర్ట్ ట్రయల్ కు మొదటి రోజు కచ్చితంగా హాజరు కావాలన్నారు.

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే ఇన్స్పెక్టర్లు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలి అన్నారు. స్పష్టమైన లక్ష్యాలు, స్పష్టమైన గమ్యాలను నిర్దేశించుకోవాలన్నారు. ప్రతివారం లాండ్ ఆర్డర్ పై ఇన్స్పెక్టర్లు సమీక్షలు చేయాలన్నారు. సాక్షాలను సేకరించడం, సంబంధిత జడ్జీలు మెజిస్ట్రేట్లతో సంప్రదించి త్వరితగతిన బాధితులకు న్యాయ సేవలు అందించాలన్నారు. ముఖ్యంగా పోలీసులు వారి ప్రాథమిక విధుల పట్ల దృష్టి సారించాలన్నారు. సంబంధిత డీసీపీలు.. ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు ఎస్ఐల పనితీరుపై పర్యవేక్షించాలన్నరు. వారి పై మానిటరింగ్ మెకానిజం ఉండాలి అన్నారు.

సెక్టార్ ఎస్ఐల పనితీరుపై తానే స్వయంగా దృష్టి సారిస్తానని సీపీ రవీంద్ర తెలిపారు.
రాష్ట్రంలోనే సైబరాబాద్ కమీషనరేట్ పరిధి లోని శంషాబాద్ జోన్ లో అంతర్జాతీయ విమానాశ్రయం, రూరల్ సబ్ అర్బన్ ప్రాంతాలు ఉన్నందున శాంతి భద్రతలు కీలకమన్నారు.

2023 సంవత్సరానికి గాను అన్ని పోలీస్ స్టేషన్‌ల సిబ్బందికి నేర నియంత్రణలో సాధించాల్సిన లక్ష్యాలపై దిశ నిర్దేశం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా విజిబుల్ పోలీసింగ్, ప్రొయాక్టివ్ పోలీసింగ్ పద్ధతులను అవలంబించాలన్నారు.
గస్తీ వాహనాలు ఎల్లవేళలా ప్రజా రద్దీగా ఉండే ప్రాంతాలలో, కూడళ్లలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సిబ్బంది కేసుల ఇన్వెస్టిగేషన్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచి వారి వెన్నులో వణుకు పుట్టించేలా పోలీసింగ్ ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్లో నమోదైన అన్ని కేసులను చట్ట ప్రకారం నాణ్యమైన పద్ధతులలో దర్యాప్తు చేసి త్వరతగతిన చార్జ్ షీట్లు వేసి కోర్టులలో దర్యాప్తు అధికారులు సమర్పించాలని ఆదేశించారు. కోర్టు అటెండెన్స్, కన్విక్షన్లు, సాక్షాల సేకరణ పై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా సెక్టార్ ఎస్ఐలు బేసిక్ పోలీసింగ్ పై దృష్టి సారించాలన్నారు.

నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి తదనుగుణంగా పాయింట్ పుస్తకాల పునర్వ్యవస్థీకరణ చేయాలన్నారు. MO క్రిమినల్స్, హిస్టరీ షీటర్స్, రౌడీ షీటర్ల కార్యకలాపాలపై స్థానిక SHOలు నిఘా ఉంచి వారు ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకుండా చూడాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలని ఆదేశించారు. పీడీ యాక్ట్ ల నమోదు, సీసీటీవీల ఏర్పాటు పై దృష్టి సారించాలన్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా కేసులను త్వరితగతిన లోక్ అదాలత్, కన్విక్షన్లు తీసుకురావాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. అలాగే సిబ్బందికి అవసరమైన ఏదైనా సామగ్రి కావాలన్నా సమాచారం ఇవ్వాలన్నారు. ఫిర్యాదుల పైన తక్షణమే స్పందించాలి అన్నారు. ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు.

ట్రాఫిక్ సమీక్ష…2023 లక్ష్యాలు..
సిపి స్టీఫెన్ రవీంద్ర ట్రాఫిక్ కి సంబంధించి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గేలా చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రూరల్ ప్రాంతాల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్ చేపట్టాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్ ల సమయంలో అవసరమైతే లాండ్ ఆర్డర్ సిబ్బంది సహకారం తీసుకోవాలన్నారు. రోడ్డు ఇంజనీరింగ్ పనులకు సంబంధించి వివిధ స్టేక్ హోల్డర్లతో భాగస్వామ్యం చేసుకొని పని చేయాలన్నారు. ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ తో పాటు .. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, ఐపీఎస్., క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్., శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, అడ్మిన్ డీసీపీ ఇందిరా, సీసీఎస్ ఏడీసీపీ నర్సింహా రెడ్డి, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, డీఐ లు, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading