నవతరం

తెలుగు దినపత్రిక

బంగారు బాతుగుడ్డు 214

* ప్రభుత్వ భూముల్లో పంజా విసురుతున్న కబ్జాదారుడు
* భూకబ్జాలు నియంత్రించడంలో విఫలమవుతున్న దుండిగల్ రెవెన్యూ అధికారులు
* ఈ కబ్జాడారుడిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదు చేస్తారా, కల్లప్పగించి చూస్తారా…?
దుండిగల్, అక్టోబర్ 13: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండల పరిధిలో చర్చి గాగిల్లాపూర్ సర్వేనెంబర్ 214 కొందరు భూకబ్జాదారులకు వరంగా మారింది. ప్రధానంగా చర్చి గాగిల్లాపూర్ లో గత కొన్ని సంవత్సరాలుగా పాగా వేసిన ఓ కబ్జాదారుడు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నాడు. అందుకు స్థానిక రెవెన్యూ కావాలికారులు మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలను నియంత్రించాల్సిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ నిద్రమత్తులో ఉన్నారు. ఇదంతా తెలిసి కూడా నీకింత నాకింత అని పంచుకుతింటున్నాడు రెవెన్యూ మండల అధికారి. గత నాలుగు సంవత్సరాలుగా కళ్లకు కట్టినట్టు ఈ భూకబ్జాదారుడు ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే 20 కి పైగా అక్రమ నిర్మాణాలు చేపట్టినా వీరికి మాత్రం కనిపించడం లేదు. ఇంత జరుగుతున్నా కావలికార్లు మాత్రం కల్లపగించి చూస్తున్నారే తప్ప సదరు విషయాన్ని ఉన్నత అధికారులకు చేరవేయడంలో విఫలమవుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఒక్కో అక్రమ నిర్మాణానికి 50,000 రూపాయలు తీసుకుంటున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఎప్పుడైనా ఒక సామాజిక కార్యకర్త ఇక్కడి భూకబ్జాల పైన ఫిర్యాదులు చేస్తే తూతూ మంత్రంగా కొల్చివేతలు చేసి వాటిని ఫోటోషూట్ చేసి అక్రమ నిర్మాణాలను తొలగించామని జబ్బలు చర్చుకుంటున్నారు రెవెన్యూ ఇన్స్పెక్టర్. ఇదంతా కూడా స్థానిక కబ్జాదారుడికి వరంగా మారిందనే చెప్పాలి. అందుకే అంటారు చర్చి గా గిల్లాపూర్ ‘ఓ కబ్జాదరుడికి ఒక బంగారు బాతు గుడ్డు’ అని… ప్రభుత్వ భూములు కాపాడుతామని హైడ్రా కమిషనర్ శపథం చేస్తున్నా చర్చి గాగిల్లాపూర్ సర్వేనెంబర్ 214 మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి ఎందుకు వెళ్లడం లేదు… ఒకవేళ వెళ్లినా హైడ్రా కూడా పట్టించుకోవడం లేదా అనే అనుమానాలు రావడం సహజం. ఇప్పటికైనా మేడ్చల్ జిల్లా కలెక్టర్, హైడ్రా కల్పించుకుని స్థానిక ప్రభుత్వ భూములను కాపాడి… తర్వాతి తరాలకు ఉపయోగపడేలా తమ విధులు నిర్వహిస్తారని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

సగం కూల్చివేతలతో మమః
ఇక్కడ జరుగుతున్న భూకబ్జాలు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు సగం కూల్చివేతలతో మమ అనిపిస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఇక్కడ భూకబ్జాదారులు తమకు తోచినంత ముట్ట చెప్పుకుని తమ పనులు చేసుకుంటున్నారు అనే పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇది ఇలాగే కొనసాగితే ఒక్క ప్రభుత్వ భూమి కూడా మిగలదని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading