నవతరం

తెలుగు దినపత్రిక

పట్టపగలే బేస్మెంట్ల నిర్మాణం

జగద్గిరిగుట్ట డివిజన్ లో కబ్జాలు షురూ..
ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం
చర్యలు తీసుకోవాలంటున్న జిన్న నరేందర్

జగద్గిరిగుట్ట / కుత్బుల్లాపూర్, డిసెంబర్ 11 (నమస్తే ఎల్లంపల్లి): జగద్గిరిగుట్ట పరిధిలోని సర్వే నంబర్ 348/1 లోని ప్రభుత్వ భూములను మాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు కొందరు కబ్జాదారులు. గత కొంతకాలంగా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న గుట్టను తవ్వి అందులో కొన్ని రూములను నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి తోడు రాజీవ్ గృహకల్ప పక్కనే వున్న మసీదు పరిసర ప్రాంతాల్లో కొన్ని డబ్బాలు వెలిశాయి. కొందరు ఫిర్యాదులు చేయటంతో స్థానిక మున్సిపల్ అధికారులు పాక్షికంగా వాటిని తొలగించారు. కబ్జాదారులు కొన్ని రోజుల తర్వాత వాటిని తిరిగి అదే స్థానాల్లో యధావిధిగా ఏర్పాటు చేసుకున్నారు..

తాజాగా..
మసీదు పక్కనే వున్న ఓ డబ్బా వెనుక కొందరు కబ్జాదారులు ఓ బేస్మెంట్ నిర్మిస్తూ స్థానికుల కంట పడ్డారు. ఇప్పటికే వీరు ఎన్నో కబ్జాలు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో కొందరు తమ సోషల్ మీడియా లో అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక నివాసి నరేందర్ మాట్లాడుతూ సంబంధిత అధికారులు స్పందించి ఇక్కడి కబ్జాదారులపై చర్యలు తీసుకుని, ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading