* నిబంధనలకు విరుద్దంగా ఉన్న వాహన నెంబర్ ప్లేట్ పై గత 2-3 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ లు
* రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపిన నంబర్ ప్లేట్ దాచినా లేదా కొన్ని నంబర్లు తొలగించినా ఇకపై ఛీటింగ్ కేసులు
* మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్
మంచిర్యాల, నమస్తే ఎల్లంపల్లి: ప్రజల్లో మార్పు తేవడమే లక్ష్యంగా వాహనదరులపై మంచిర్యాల జోన్ పరిదిలో గత 2-3 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తు వాహనదారులకు అవగాహనా నిర్వహిస్తూ ఇ. చలాన్స్ జరిమానా విధించడం జరుగుతుందని, ఇట్టి స్పెషల్ డ్రైవ్స్ డిసెంబర్- 31 వరకు ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని నిబందనలకు విరుద్దంగా, ఇష్టారీతిన నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేయడం చేస్తున్నారు. కొందరు వాహనదారులు ట్రాఫిక్ ఈ చలాన్ నుంచి తప్పించుకోవడం కోసం వాహనాలపై ఫ్యాన్సీ నంబర్ తో పాటు తప్పుడు నంబర్ లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్ష రాలు గుర్తించలేనంతగా ఉంటున్నాయి. ఇంకా కొందరు ఏకంగా మాస్క్ వేస్తున్నారు. ప్రస్తుతం వాహనాలన్నింటికీ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగిస్తున్నారు. కాని కొందరు కావాలనే వాటిని తొలగించడం, నంబర్ గుర్తించకుండా నెంబర్ ప్లేట్ విరగ్గొట్టడం చేస్తున్నారు. ఇలాంటి వారు వాహన తనిఖీల్లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కావున మంచిర్యాల జోన్ పరిదిలోని ప్రజలు అందరు పోలీస్ వారికీ సహకరించి డిసెంబర్- 31 వరకు తమ వాహనాల నెంబర్ ప్లేట్స్ నిబందనల ప్రకారం బిగించు కోవాలని, లేని పక్షం లో జనవరి 01 -01-2023 నుండి వాహనాలపై నంబర్ లేకుండా, నిబందనలకు విరుద్దంగా నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసి వాహనం నడిపితే వాహనదారుడిపై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని మంచిర్యాల డిసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్ వాహనదారులకు హెచ్చరించారు. మంచిర్యాల జోన్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహనదారులను కట్టడి చేయడంతో పాటు చోరీ వాహనాలను గుర్తించడంలో భాగంగా మంచిర్యాల జోన్ పరిధిలో వచ్చే జనవరి మొదటి తారీఖు నుండి నంబర్ లేకుండా వాహనం నడిపే వాహనదారులపై ఛీటింగ్ కేసు నమోదు చేయబడుతుందని, అలాగే ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనంపై ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ల ఏర్పాటు, ఉద్యేశపూర్వంగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ను మార్పు చేసిన, నంబర్లపై స్టిక్కర్లుగాని, నంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్కులను తగిలించిన, నంబర్ ప్లేట్ ను వంచిన వాహనదారులపై కూడా ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని, ముఖ్యంగా వాహనాదారులు తమ వాహనాలకు రవాణా శాఖ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించిన కూడా వాహనదారులు తమ వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ ను ఏర్పాటు చేసుకోకుండా వాహనం నడిపిన అలాంటి వాహనదారులపై కూడా ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని మంచిర్యాల జోన్ డిసిపి డిసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్ వెల్లడించారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.