• 1/70లో భూ కబ్జాలు సాధ్యమేనా?
• లక్ష్మీదేవి పల్లి మండలంలో రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు
• మున్సిపాలిటీలో కూల్చేస్తారు…. మండలంలో వదిలేస్తారా??
• ఇందిరానగర్లో ప్రభుత్వ భూమి మాయం
• లక్షల్లో దండుకుంటున్న ఓ ముఠా
• తెర వెనక ఉండి నడిపిపిస్తున్న ఓ నాయకుడు
• అవినీతి అధికారులే వీరికి అండ
• గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణాలు
• ప్రభుత్వ భూమి అని తెలిసినా చర్యలు శూన్యం
• కొన్ని రూములకే నోటీసులా?
• ప్రైవేట్ వెంచర్ ల తలపిస్తున్న అక్రమ నిర్మాణాలు
• జిల్లా కలెక్టర్ ఈ భూమిని మరిచారా?
• కిందిస్థాయి రెవెన్యూ అధికారుల వాటా ఎంత??
• ఎవరైనా అటువైపు వెళ్తే… ఆ కబ్జా ముఠా రంగంలోకి దిగి బెదిరింపులు.
• గతంలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డు ఎక్కడ??
• అక్రమ నిర్మాణాలు కూల్చివేసి, ప్రభుత్వ భూములు కాపాడాలంటున్న ప్రజలు
• ఆ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుంటే ధర్నాకు సిద్ధమంటున్నా ప్రతిపక్ష నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం – లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని ప్రశాంత్ నగర్ పంచాయతీలో ఉన్న ప్రభుత్వ భూములకు రక్షణ కరువైందని చెప్పుకోవచ్చు , రైల్వే కట్టకు ఆనుకుని వున్న ప్రభుత్వ భూములు మాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు కొందరు కబ్జాదారులు. రైల్వే కట్టకు ఆనుకొనివున్న ఈ భూములపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. దీంతో గత కొన్ని సంవత్సరాల నుండి ఎలాగోలా ఈ భూములను కబళించివేయాలనే పన్నాగం పన్నారు. దాంతో ఏం చేయాలో తెలియక గమ్మున ఉన్న వీరికి కొందరు అవినీతి అధికారులు తోడు కావటంతో గత సంవత్సర కాలం నుండి రెచ్చిపోయిన ఈ కబ్జాదారులు ఎన్నో ప్లాట్ లు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ కబ్జా భాగోతంలో ఎవరెవరున్నారు. ఎంత మేర ప్రభుత్వ భూమిని మాయం చేశారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసిల్దార్ ఈ భూమిని సందర్శించారా…? లేదా…?? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ కబ్జా భూమిపై ‘నమస్తే ఎల్లంపల్లి ప్రత్యేక కథనం’ మీ ముందుకు…
లక్ష్మీదేవి పల్లి / భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే ఎల్లంపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని ప్రశాంత్ నగర్ పంచాయతీలో ఉన్న సర్వే నెంబర్ 31/8, 39/9లో గల ప్రభుత్వ భూములకు రక్షణ కరువైందని చెప్పుకోవచ్చు , రైల్వే కట్టకు ఆనుకుని వున్న ప్రభుత్వ భూములు మాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు కొందరు కబ్జాదారులు. రైల్వే కట్టకు ఆనుకొనివున్న ఈ భూములపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. దీంతో గత కొన్ని సంవత్సరాల నుండి ఎలాగోలా ఈ భూములను కబళించివేయాలనే పన్నాగం పన్నారు. దాంతో ఏం చేయాలో తెలియక గమ్మున ఉన్న వీరికి కొందరు అవినీతి అధికారులు తోడు కావటంతో గత సంవత్సర కాలం నుండి రెచ్చిపోయిన ఈ కబ్జాదారులు ఎన్నో ప్లాట్ లు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ కబ్జా భాగోతంలో ఎవరెవరున్నారు. ఎంత మేర ప్రభుత్వ భూమిని మాయం చేశారు. జిల్లా కలెక్టర్ ఈ భూమిని సందర్శించారా లేదా అనేది ప్రశాంతంగా మారిందని చెప్పుకోవచ్చు ఈ మండలంకు పక్కనున్న కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో కొన్ని రోజుల క్రితం మున్సిపల్ అధికారులు రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలపై కూల్చివేతలు నిర్వహించినా మాట అందరికీ తెలిసిందే కానీ లక్ష్మీదేవి పల్లి మండలం ఏజెన్సీ 1/70లో ఉన్నప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతో గత సంవత్సరం నుండి కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ అధికారులు మర్చిపోయారా అనే విమర్శలు వెలువడుతున్నాయి. మున్సిపాలిటీలో ఒక న్యాయం మండలంలో ఒక న్యాయమా అని స్థానిక ప్రజలు ఈ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలోనే కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడి ప్రభుత్వ భూములపై కన్నేసిన ఓ కబ్జా ముఠా ప్రస్తుతం కొన్ని రూములో, బేస్మెంట్ లు అక్రమ నిర్మాణాలు చేసి తమ సత్తా చాటుకుంది. ఇదంతా కూడా స్థానిక రెవెన్యూ అధికారులకు తెలియదా అంటే.. అంతా తెలుసంటున్నారు స్థానిక ప్రజలు. కబ్జాదారుల చేతిలో పావులుగా మారిన రెవెన్యూ అధికారులు నామమాత్రపు నోటీసులు ఇస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు దండిగానే వున్నాయి.
సామాన్య ప్రజలకు ఒక చట్టం, డబ్బులున్నవాడికో చట్టమా అంటూ మండిపడుతున్నారు ఇక్కడి జనం. కటిక పేదవాడు ప్రభుత్వ భూమిలో ఓ గుడిసె వేసుకుంటే సహించని రెవెన్యూ అధికారులు పట్టపగలు, అర్ధరాత్రిళ్ళు అనే తేడా లేకుండా రెవెన్యూ అధికారులను, జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం సవాలు చేస్తూ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా ఏమీ తెలియనట్లు నటిస్తున్న లక్ష్మీదేవి పల్లి రెవెన్యూ అధికారులపై, అధికార పార్టీ నాయకుల పై పలు అనుమానాలు తావిస్తున్నాయి. అదే కాకుండా అక్కడ వెలుస్తున్న నిర్మాణాలను చూసి అటువైపు ఎవరైనా వెళ్లాలని ప్రయత్నిస్తే.. అక్కడ ఉన్న కొందరు ప్రైవేట్ గూండాలు ‘మీరెవెరు, మీకేం కావాలి అని ఆరా తీస్తారు. వారికి అనుకూలంగా ఉంటే సమాధానం చెప్తారు లేదంటే బెదిరిస్తారు. అమాయకులైన పేద ప్రజలకు నోటరీ పేపర్లు రాసి ఇస్తాము అంటూ, అప్పటికే నిర్మించి ఉంచిన కొన్ని నిర్మాణాలను చూపిస్తారు. దీంతో సొంత ఇంటి కల వున్న మధ్యతరగతి ప్రజలు ఎంతోమంది వీరి ఉచ్చులో చిక్కుకుని మోసపోయారు. ఇక్కడి ప్లాట్ లను అమ్మడం ఒక వంతయితే.. అవే ప్లాట్ లను వేరేవారికి ఎక్కువ రేటుకు అమ్మి లక్షలు దండుకుంటారు. స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి ఇక్కడి ప్రభుత్వ భూములపై కన్నేసి, వాటిని ప్లాట్ లుగా విభజించి మొదటగా ఒక్కో ప్లాట్ ను లక్ష, రెండు లక్షల రూపాయలు అమ్ముకుంటారు. అవి ఉంటాయో, పోతాయో తెలియక ప్లాట్ లను కొనుక్కున్న అమాయకులు అందులో చిన్న చిన్న ఇండ్లను ఏర్పాటు చేసుకుని స్వంత ఇంటి కల నెరవేరిందనుకుంటారు. ఇంతలోనే రెవెన్యూ అధికారులు వచ్చి మీరు ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇండ్లను నిర్మించారని వీటికి నోటీసులు ఇస్తారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లూపే అంతా అయిపోతుంది. దీంతో ఏం చేయాలో తూచక లబొదిబోమంటూ స్థానిక ప్రజా ప్రతినిధుల వద్దకు పరుగులు తీస్తారు. వారు కూడా ఏం చేయాలో తెలియక అధికారులకు ఫోన్లు చేసి కరెంటు మీటర్లు వచ్చిన ఇండ్లను కూల్చకండంటూ ఆదేశాలు జారీ చేస్తారు. దీంతో ఇక్కడి ప్రభుత్వ భూముల్లో ఒకటో రెండో ఇండ్లు నిలబడతాయి. కూల్చివేతల సమయంలో అక్కడ నుండి జారుకున్న కబ్జాదారులు మళ్ళీ అక్కడ ప్రత్యక్షమవుతారు. అంతే.. అమ్మకాలు మళ్ళీ మొదలవుతాయి. ఇప్పుడు మాత్రం లక్షా, రెండు లక్షలు కాకుండా అయిదు, ఆరు లక్షలకు ఒక ప్లాట్ అంటూ కొంత రేటు పెంచి ప్లాట్ లు అమ్ముకుంటారు. మళ్ళీ అదే తంతు కొనసాగుతుంది. ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఒకడుగు ముందుకేసి వారివద్ద నుండి కొన్ని నోటరీ పత్రాలు సంపాదించి కొన్ని కేసులు నమోదు నమోదు చేస్తారు. వీధి నిర్వహణలో భాగంగా కొద్ది భాగమూ, సగ భాగమో కొన్ని నిర్మాణాల కూల్చివేతలు చేస్తారు. ఇప్పటివరకు కేసులంటే భయపడిన కబ్జాదారులు కొందరు దళారులను ఆసరాగా చేసుకుని కొందరు అవినీతి అధికారులకు ఆశ చూపించి, మీకు కొన్ని ప్లాట్ లు ఇస్తాము, కొంత సైడ్ అమౌంట్ ఇస్తాము అంటూ ఆశ చూపిస్తారు. ఆశ కు రుచి మరిగిన అవినీతి అధికారులు వారి కబ్జాలను చూసీ చూడనట్టు పోతారు. వారి ఆఫర్ లను తిప్పికొట్టే అధికారులు తమ విదులు తాము నిర్వహిస్తారు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఇక్కడి కబ్జాదారుల్లోనూ తెలివి పెరుగుతుంది. దీంతో ఎవరితో చెప్పించుకుంటే పనవుతుందో ఆలోచిస్తారు. అంతే.. దాని ఫలితమే ఇక్కడి అక్రమ నిర్మాణాలంటున్నారు స్థానిక ప్రజలు. ఈ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే సంబంధిత అధికారులు కొన్నింటికి నోటీసులు మాత్రమే చేస్తారు, ఆ నోటీసులు ఫైల్ చేసి ఉన్నతాధికారులకు పంపుతారు. దానితో ఈ కబ్జాదారులు బాగోతం ప్రశాంతం అవుతుంది. గతంలో ఈ సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిలో ఓ ప్రభుత్వ సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. దానిని మాయం చేసి వీరికి కబ్జాలను సజావుగా సాగిస్తున్నారు.
తెరవనుకున్న నాయకుడు ఎవరు?
ఈ అక్రమ కట్టడాలలో తెర వెనక ఉండి నడిపిస్తున్న ఆ నాయకుడు ఎవరాని పలు అనుమానాలు తాగిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు సైతం కొన్ని రూములు కి నోట్స్ లు ఇచ్చి మరి మిగతా వాటిని వదిలేయడం వారిపై చర్యలు తీసుకోపోవడంలో అధికారుల పాత్ర ఎంతుందో అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకవైపు ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రభుత్వ పై స్థాయి అధికారులు పలుమార్లు సమావేశాలు పెట్టి చెప్పినప్పటికీ ఈ కబ్జాలు మాత్రం ఆగటం లేదనేది వాస్తవం.
ప్రభుత్వ భూములు కాపాడాలి
కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని గుర్తించి, ఆ భూములను భవిష్యత్ తరాల కొరకు కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కబ్జాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్టులు నమోదు చేసి మళ్ళీ ఎవరూ కూడా ప్రభుత్వ భూముల జోలికి రాకుండా లాండ్ ప్రొటెక్షన్ కమిటీ సైతం చర్యలు తీసుకోవాలని కొందరు సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.