* పోలీస్ కానిస్టేబుళ్లపై దాడిచేసిన దొంగలు
హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో పోలీస్ కానిస్టేబుల్లపై తల్వార్ తో దాడిచేశారు దారి దోపిడీ ముఠా. ఈ ఘటన నగరంలో కలకలం సృష్టిస్తోంది. అయితే నార్సింగి దారి దోపిడీ కేసు దర్యాప్తు కోసం కూకట్పల్లి సిక్కుల బస్తీ కి వెళ్లిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు ఈ దోపిడీ ముఠా. అంతటితో ఆగకుండా బైక్ పై వెళ్తున్న పోలీసు కానిస్టేబుళ్లపై తల్వార్ లతో దాడికి పాల్పడి ఇద్దరు కానిస్టేబుళ్లను తీవ్రంగా గాయపర్చినట్లు తెలుస్తుంది. ఇందులో ఓ కానిస్టేబుల్ కు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. చికిత్స పండుతున్న కానిస్టేబుల్ కు ఛాతి, ఎద పై తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. గాయపడిన పోలీసులను పోలీసు ఉన్నతాధికారులు పరామర్శించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.