నవతరం

తెలుగు దినపత్రిక

ద్విచక్ర వాహనం, స్థలం దస్తావేజులు అపహరణ

దగ్గర బంధువే నమ్మించి దొంగిలించాడు

ఏపీ 20 ఏజే 7085 డిస్కవర్ 100 సిసి ఎరుపు రంగు బండి, కరెంటు మెషిన్లు, ఐదు సెంట్ల స్థలము డాక్యుమెంట్స్ చోరీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నమస్తే ఎల్లంపల్లి: అశ్వారావుపేట మండల కేంద్రంలో, నెహ్రు నగర్ కాలనీ నందు అద్దె ఇంట్లో నివాసముంటున్న తోర్లపాటి సాంబశివరావు అనే వ్యక్తి వద్దనుండి తన దగ్గర బంధువైన వడ్లగూడెం గ్రామానికి చెందిన గోరింకల లక్ష్మీనారాయణ, వయస్సు 32 సంవత్సరాలు, సాంబశివరావుని నమ్మించి, ఒక వారం రోజులపాటు తనతోపాటు ఉంటూ, తాను అమ్మిన వడ్లగూడెం గ్రామంలోని ఐదు సెంట్ల స్థలానికి చెందిన పత్రాలను, దస్తావేజులను, ఏపీ 20 ఏజీ 7085, డిస్కవర్ 100 సిసి- ఎరుపు రంగు వెహికల్ తో పాటు కరెంటు డ్రిల్ మిషన్ ,స్లాబ్ కట్టర్ ,వాల్ కటింగ్ మిషన్, మొత్తం కలిపి సుమారు 50 వేల రూపాయల విలువచేసే వస్తువులను దొంగిలించి, 31/12/2022 వ తారీకున పరారయ్యాడు. ఆ సమయంలో సాంబశివరావు ఇంటి వద్ద లేకపోవడం, అతని పూర్తిగా నమ్మి ఆశ్రయం ఇవ్వడం, అదే అదనుగా భావించిన లక్ష్మీనారాయణ అలియాస్ లచ్చిగాడు వడ్ల గూడెం గ్రామంలో సుమారు ఐదు సెంట్ల స్థలము దస్తావేజు పేపర్లను తీసుకొని వెళ్ళిపోయినట్లు బాధితుడు రోదిస్తున్నాడు. వారం రోజులుగా సాంబశివరావు సదరు వ్యక్తిని ఎంత వెతికినా దొరకకపోవడంతో, సత్తుపల్లి మండలం, కిష్టాపురం గ్రామానికి చెందిన లచ్చిగాడి పెద్దమ్మ కరుణ ను ఈ విషయంపై ఎంక్వయిరీ చేయగా, లచ్చిగాడి సొంత గ్రామమైన వడ్ల గూడెం, కొండా మంగయ్య అనే బంధువు దగ్గరకు వెళ్లి ఉండవచ్చునని చెప్పడంతో, కొండా మంగయ్య ఇంటి దగ్గర ప్రాంతంలో వెతుకులాడి ఎంతకీ దొరకకపోవడంతో, ది 7/01/ 2023న స్థానిక అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై రాజేష్ కుమార్ దొంగను వెతికి పట్టుకొని, వస్తువులను, స్థలం విలువ పత్రాలను (దస్తావేజు పేపర్లను) సాధ్యమైనంతవరకు అతని నుండి రికవరీ చేసి అప్పగిస్తామని తెలియజేశారు. సాంబశివరావు ఎలక్ట్రికల్ మెషిన్లు, పనిచేసుకోవడానికి, వివిధ ప్రాంతాలకు తిరిగి జీవనం గడుపుకోవడానికి ద్విచక్ర వాహనం అపహరణకు గురికావడంతో, చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలియజేశాడు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading