నవతరం

తెలుగు దినపత్రిక

ఓయో రూమ్స్ తొలగించండి

హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: ఓయో రూమ్స్ వలన కాలనీలో తిరగలేక పోతున్నామని స్థానికులు ఆందోళన బాట పట్టారు. మియాపూర్ పీయస్ పరిధిలోని కొండాపూర్ న్యూ సైబర్ వ్యాలీ కాలనీ వాసులు నిరసన చేపట్టారు. కాలనీలో ఓయో రూమ్స్ ఏర్పాటు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓయో రూమ్స్ లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. కాలనీలో న్యుసెన్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఓయో రూమ్స్ వలన కాలనీలో తిరగలేక పోతున్నామనీ స్థానికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఓయో రూమ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఓయో రూమ్స్ ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం మియాపూర్ పోలీసులకు కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading