నవతరం

తెలుగు దినపత్రిక

ప్రోయాక్టివ్ – క్రైమ్ ప్రివెంటివ్ పోలిసింగ్ కావాలి

‘కన్విక్షన్ల శాతాన్ని పెంచాలి’: సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్
-పీపీ లకు ప్రశంసాపాత్రల అందజేత
-ఉత్తమ పనితీరు కనబర్చిన లైజనింగ్ ఆఫీసర్లు, సీడీఓలకు రివార్డులు
-ప్రోయాక్టివ్ – క్రైమ్ ప్రివెంటివ్ పోలిసింగ్ కావాలి: సీపీ

సైబరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు పబ్లిక్ ప్రాసిక్యూటార్లు (పీపీలు), అడిషనల్ పీపీలు, అసిస్టెంట్ పీపీలు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు (సిడిఓ), ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, సిబ్బందితో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… గత రెండేళ్ళుగా కరోనా ఇతర కారణాల కారణంగా పిపి మీటింగ్ ఏర్పాటు చేసుకోలేదన్నారు. సైబరాబాద్ లో ఎక్కువగా కేసులు రిజిస్టర్ అవుతాయన్నారు. 2021-2022 సంవత్సరానికి సంబందించి 33000 కేసులు నమోదయ్యాయన్నారు. UI కేసుల పెండేన్సీ 12,000 నుంచి 8,400 కు తగ్గించడం జరిగిందన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ కు వచ్చే కేసుల కు సంబంధించి త్వరితగతిన ఛార్జ్ షీట్ ఫైలింగ్, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. కేసుల డెటెక్షన్ శాతం 55 నుంచి 65 శాతం అంటే 10 శాతం పెరిగిందన్నారు. ప్రాపర్టీ అఫెన్సులు 28 శాతం తగ్గించామన్నారు. ప్రోయాక్టిక్ అండ్ క్రైమ్ ప్రివెంటివ్ పోలిసింగ్ ఉండాలన్నారు.

2023 సంవత్సరానికి సంబంధించి గోల్స్ లో భాగంగా కోర్టుకు కన్విక్షన్లను పెంచాలన్నారు. కోర్టు కన్విక్షన్ల శాతాన్ని పెంచేదుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ప్రాసిక్యూటర్లు, కోర్ట్ లైసనింగ్ ఆఫీసర్లు పరస్పర సహకారం అందించుకోవాలన్నారు. గతేడాది కంటే ఈ ఏడు కన్వీస్క్షన్ ల శాతం రెట్టింపు కావాలని ఆకాంక్షించారు. సైబర్ క్రైమ్స్ కు సంబంధించి అద్భుతమైన పురోగతి జరుగుతోందన్నారు.

సిబ్బంది క్రమశిక్షణతో పని చేసి నేరస్తులకు కోర్టులో మరిన్ని శిక్షలు పడేలా చేసి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు, తెలంగాణ పోలీసులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కోర్టు కానిస్టేబుళ్లు బాగా పని చేది కన్విక్షన్ల శాతాన్ని పెంచాలన్నారు. వారంట్ల ఎగ్జిక్యూషన్ బాగా జరుగుతోందన్నారు. కన్విక్షన్లను పెంచడంలో కోర్టు డ్యూటీ ఆఫీసర్లది ముఖ్యపాత్ర/ముఖ్య భూమిక పోషిస్తున్నారన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటార్లు, సిడిఓ లు ఇచ్చిన సూచనలను ఐఓ (ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు)లకు చెబుతామన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు FIR నమోదు, ఇన్వెస్టిగేషన్ ప్రతీ స్టేజ్ లో దృష్టి సారించాలన్నారు. కేసు కట్టడం ఒక ఎత్తైతే, ఇన్వెస్టిగేషన్ చేయడం, కన్విక్షన్ తీసుకురావడం మరో ఎత్తన్నారు.

ముఖ్యంగా మహిళలు, చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడిన వారికి వెంటనే శిక్షలు పడితే అలాంటి నేరాలు జరగకుండా ఉంటాయన్నారు. కేసు తుది తీర్పు వెలువడి దోషులకు శిక్షపడేలా జాగ్రత్తగా పని చేయాలన్నారు. ముఖ్యమైన, సెన్సేషనల్ కేసులను రోజువారీ ఫాలోఅప్ చేయాలని సూచించారు. సెన్సిటివ్, ఎక్కువ మందిని ప్రభావితం చేసే సెన్సేషనల్ కేసులను గుర్తించి సత్వరం పరిష్కరించాలన్నారు. పోలీసులు నిబద్ధతతో పని చేయాలన్నారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు.

సైబరాబాద్ డి‌సి‌పి క్రైమ్స్ సింగ న్వార్ కల్మేశ్వర్, ఐపీఎస్., సైబరాబాద్ లో మంచి శాతం కన్విక్షన్ రేట్ రావడానికి పీపీలు, ఏపీపీలు, సీడీఓలు, కోర్ట్ కానిస్టేబుళ్ల అందరి సహకారం ఉందన్నారు. మాట్లాడుతూ ఐఓ లు వారికి నచ్చిన భాషలో కాకుండా కోర్టు వారికి సమ్మతమైన భాషలో కేసుల వివరాలు రాసుకోవాలన్నారు. కోర్ట్ కానిస్టేబుల్స్, ఐఓ లు, ఈసారి ఇంకా ఎక్కువ కన్విక్షన్లు తీసుకురావలన్నారు. కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లు ఏకతాటిపై పని చేసి బాధితులకు న్యాయం జరిగేల చూడాలన్నారు. క్రైమ్ అనలటిక్స్, కోర్ట్ వైస్, పోలీస్ స్టేషన్ వైస్ తెలుసుకునేందుకు త్వరలో పోలీస్ సిబ్బంది కోసం ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. యాప్ గురించి వివరించారు.

డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ (రంగారెడ్డి జిల్లా) జి. కస్తూరిభాయి మాట్లాడుతూ.. పబ్లిక్ ప్రాసెక్యూటర్లు, పోలీసుల సమన్వయంతో గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ కన్విక్షన్లు తీసుకువస్తామన్నారు. NDPS కేసులపై శ్రద్ధా వహించాలన్నారు. ఇటీవలి జడ్జిమెంట్లు, అమెండ్ మెంట్లను వివరించారు.

పబ్లిక్ ప్రాసెక్యూటర్/ జాయింట్ డైరెక్టర్ (రంగారెడ్డి జిల్లా) సీ. రాము మాట్లాడుతూ.. కేసుల ఇన్వెస్టిగేషన్లలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, సీడీఓ ల పాత్ర కీలకమన్నారు. పక్కా సాక్ష్యాలతో కోర్టుకు వచ్చినప్పుడే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉందని సూచించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. కోర్టులో ప్రజెంటేషన్ ముఖ్యమన్నారు. నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు.

విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి కవిత మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల విషయంలో వెంటనే కేసులు కట్టడంతో పాటు వేగంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు.

అనంతరం సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో కన్విక్షన్ల రేట్ ను పెంచేందుకు కృషి చేసిన డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ (రంగారెడ్డి జిల్లా) జి. కస్తూరిభాయి, పబ్లిక్ ప్రాసెక్యూటర్ / జాయింట్ డైరెక్టర్ (రంగారెడ్డి జిల్లా) సీ. రాము, పబ్లిక్ ప్రాసెక్యూటర్ / జాయింట్ డైరెక్టర్ (సంగా రెడ్డి జిల్లా) జె శ్రీనివాస్ రెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సైబరాబాద్ సీపీ ప్రశంసాపత్రంతో ఇవ్వడంతో పాటు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. అలాగే ఉత్తమ పనితీరు కనబర్చి ఎక్కువ కన్విక్షన్లు తీసుకువచ్చిన కోర్టు అఫీషియల్స్, కోర్టు కానిస్టేబుల్స్ కి సీపీ ప్రశంసాపత్రం తో పాటు రివార్డులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, ఐపీఎస్., సైబరాబాద్ డి‌సి‌పి క్రైమ్స్ శ్రీ సింగ న్వార్ కల్మేశ్వర్, ఐపీఎస్., డి‌సి‌పి మాదాపూర్ శిల్పవల్లి, డి‌సి‌పి బాలానగర్ టి శ్రీనివాస రావు, ఐపీఎస్., డిసిపి రాజేంద్రనగర్ జగదీశ్వర్ రెడ్డి, ఐపీఎస్., విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి కవిత, సైబర్ క్రైమ్స్ డిసిపి రితి రాజ్, ఐపీఎస్., డిసిపి మేడ్చల్ సందీప్, రోడ్ సేఫ్టీ డిసిపి ఎల్సి నాయక్, సైబరాబాద్ పరిధిలోని ఏడీసీపీలు, ఏసిపిలు, ఓఎస్డీ మల్లా రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ (రంగారెడ్డి జిల్లా) జి. కస్తూరిభాయి, పబ్లిక్ ప్రాసెక్యూటర్ / జాయింట్ డైరెక్టర్ (రంగారెడ్డి జిల్లా) సీ. రాము, పబ్లిక్ ప్రాసెక్యూటర్/ జాయింట్ డైరెక్టర్ (సంగారెడ్డి జిల్లా) శ్రీ జె శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ లీగల్ అడ్వైజర్లు కె రేవా రెడ్డి, వీ బాల బుచ్చయ్య, సైబరాబాద్, పబ్లిక్ ప్రాసెక్యూటర్లు, అడిషనల్ పీపీలు, అసిస్టెంట్ పీపీలు, సిఐలు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు (ఐఓ), కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లు, కోర్టు కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading