నవతరం

తెలుగు దినపత్రిక

ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తికి 10సం. జైలు శిక్ష

అశ్వారావుపేట, నమస్తే ఎల్లంపల్లి: కేసు నమోదయ్యి సంవత్సరాలు గడిచాయి. వాయిదాలతో చేసిన తప్పు తీరిపోతుందనుకొంటే పరిపాటే. చిన్న తప్పే కదా అని చులకన చేస్తే అది పెను ప్రమాదానికి దారి తీస్తుంది.ముద్దాయి ఖైదీగా మారానంతవరకు శిక్ష భారం తెలియదు. కాలం గడిచినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విధి సహించక చేసిన తప్పుకు శిక్ష వేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తికి 10 సంవత్సరాలు జైలు శిక్షగా కోర్టు తీర్పు తీర్చింది. మండలంలో తిరుమల కుంట గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించి మోసగించడంతో , అప్పట్లో అతనిపై కేసు నమోదు అయింది. అప్పటినుంచి ఇప్పటివరకు కోర్టు చుట్టూ వాయిదాలకు తిరిగాడు. చివరకి కోర్టు తీర్పు తీర్చింది.10 సంవత్సరాలు జైలు శిక్ష, 10000 రూపాయల జరిమానా కొత్తగూడెం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్ విధించింది.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading