నవతరం

తెలుగు దినపత్రిక

ముగ్గురు దొంగల అరెస్ట్

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి దోచుకుంటున్న ఘరానా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 తులాల బంగారం,35 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.1.50లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీరంగుల రవి, దీరంగుల భరత్, తన్నీరు శ్రీను అనే ముగ్గురు వ్యక్తులు ఈజీ మనీ కోసం తమ జల్సాలో కోసం చోరీలు చేయడం పనిగా పెట్టుకుని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఇండ్లలో చోరీలు చేశారు. వీరిపై ప్రత్యేక నిఘా పెట్టిన బాచుపల్లి క్రైమ్ టీమ్ పోలీసులు విశ్వసనీయ సమాచారంతో సూరారంలో ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, వీరిపై పలు కేసులు నమోదై ఉన్నాయని విచారణలో తేలిందని తెలిపారు. వీరు ముఠాగా ఏర్పడి రాత్రి పగలు తేడా లేకుండా చోరీలకు పాల్పడుతున్నారని, అత్యాచారం, హత్యా నేరాలు కూడా చేసిన కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. కరడుగట్టిన ఘరానా దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బాచుపల్లి క్రైమ్ టీమ్ ను అభినందించిన ఉన్నతాధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading